‘గేమ్ ఛేంజర్’కి లైన్ క్లియర్.. ‘భారతీయుడు 2’ వచ్చేస్తుంది!

గ్రేట్ డైరెక్టర్ శంకర్ గతంలో ఎప్పుడూ లేని విధంగా ఇప్పుడు ఒకేసారి రెండు సినిమాలతో బిజీ అయ్యాడు. వాటిలో ఒకటి ‘భారతీయుడు 2’ అయితే.. మరొకటి ‘గేమ్ ఛేంజర్’. ఇంచుమించు సమాంతరంగా పూర్తవుతోన్న ఈ రెండు సినిమాలలో ముందుగా వచ్చేది ‘భారతీయుడు 2’ అని తెలిసిందే. కానీ.. ఈ చిత్రం ఎప్పుడు విడుదలవుతోందా? ‘గేమ్ ఛేంజర్’కి ఎప్పుడు లైన్ క్లియర్ అవుతోందా? అంటూ మెగా ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఆ తరుణం రానే వచ్చింది.

మోస్ట్ అవైటింగ్ ‘భారతీయుడు 2’ రిలీజ్ కి రెడీ అవుతోంది. వచ్చే జూన్ లో ‘భారతీయుడు 2’ని ప్రేక్షకుల ముందుకు తీసుకురాబోతున్నట్టు ప్రకటించారు మేకర్స్. అయితే.. జూన్ నెలలో ఏ తేదీన రాబోతుందనే దానిపై ఇంకా క్లారిటీ రావాల్సి ఉంది. 1996లో వచ్చిన ‘భారతీయుడు’కి సీక్వెల్ గా రూపొందుతోన్న ఈ మూవీలో మరోసారి కరప్షన్ కదం తొక్కబోతున్నాడు సేనాపతి పాత్రలో కమల్ హాసన్. లైకా ప్రొడక్షన్స్ అత్యంత భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్న ఈ చిత్రంలో సిద్ధార్థ్, కాజల్, రకుల్, ఎస్.జె.సూర్య, బాబీ సింహా, బ్రహ్మానందం, సముద్రఖని వంటి భారీతారాగణం ఉంది. ఈ చిత్రానికి అనిరుధ్ సంగీతాన్ని సమకూరుస్తున్నాడు

Related Posts