స్కందను లేపడానికి వస్తోన్న బాలయ్య

కొన్ని కాంబినేషన్స్ అనౌన్స్ అయినప్పుడే ఆశ్చర్యపరుస్తాయి. అలాంటిదే బోయపాటి శ్రీను – రామ్ కాంబోలో వస్తోన్న స్కంద సినిమా. అఫ్‌ కోర్స్ అనౌన్స్ మెంట్ టైమ్ లో టైటిల్ లేదనుకోండి. బోయపాటి స్కూల్ కు, రామ్ స్కూల్ కు చాలా తేడా ఉంది. బోయపాటి అంటే బాలయ్య లాంటి మాస్ హీరోల రేంజ్ లోనే ఎక్స్ పెక్ట్ చేస్తాం. రామ్ క్లాస్. పైగా బోయపాటి రేంజ్ విలన్స్ ను ఢీ కొట్టే స్టేచర్ కూడా కనిపించదు. అందుకే అంతా అనుమానపడ్డారు. అయినా ఆ కాంబినేషన్ లో సినిమా ముందుకు వెళ్లింది. కొన్నిసార్లు ఇవే సర్ ప్రైజింగ్ గా సక్సెస్ అవుతుంటాయి. అదే జరిగితే రామ్ కూ కొత్త ఇమేజ్ యాడ్ అవుతుంది.


సెప్టెంబర్ 15న ఈ చిత్రం విడుదల కాబోతోంది. అయితే ఇప్పటి వరకూ ఈ మూవీ నుంచి వచ్చిన టీజర్, సాంగ్స్ పెద్దగా బజ్ క్రియేట్ చేయలేకపోయాయి. రెండు పాటల్లో మొదటిది చాలా రొటీన్ అనిపించుకుంది. రెండో సాంగ్ గా వచ్చిన గండరబాయ్ అనే పాట మాత్రం మాస్ కు కొంత వరకూ కనెక్ట్ అవుతోంది. ఇక ఎలా చూసినా మూవీకి బజ్ అయితే రావడం లేదు.

అటు చూస్తే సినిమాను ప్యాన్ ఇండియన్ రేంజ్ లో విడుదల చేస్తున్నాం అని చెబుతున్నారు. అందుకే ట్రైలర్ లాంచ్ ను కాస్త గ్రాండ్ గా చేయాలనుకుంటున్నారు. ఈ నెల 26న శిల్ప కళా వేదికలో ట్రైలర్ ను లాంచ్ చేయబోతున్నారు. ఈ ఈవెంట్ కు చీఫ్ గెస్ట్ గా బాలకృష్ణను ఇన్వైట్ చేశారు. దర్శకుడు బోయపాటి కాబట్టి ఆయన కూడా వెంటనే ఎస్ అన్నాడు. సో.. బాలయ్య ట్రైలర్ చూసిన తర్వాత చెప్పే మాటలు ఈ సినిమాకు కీలకం అవుతాయనుకోవచ్చు.


ఇప్పటి వరకూ స్కంద థీమ్ ఏంటనేది ఇప్పటి వరకూ ఏ క్లారిటీ లేదు. ట్రైలర్ తర్వాత కంటెంట్ ఏంటనేది కొంత వరకైనా తెలుస్తుంది. తెలిస్తేనే ఆ తర్వాత ప్రమోషన్స్ కు ప్లస్ అవుతుంది. ఆ ట్రైలర్ తోనే వీళ్లు కంట్రీ మొత్తం ప్రమోషన్స్ చేయాలి కాబట్టి.. ట్రైలర్ తో బోయపాటి బ్లాస్టింగ్ రెస్పాన్స్ వచ్చేలా చేస్తాడేమో చూడాలి. మొత్తంగా బాలయ్య వచ్చిన తర్వాతైనా ఈ చిత్రానికి ఏమైనా బజ్ వస్తుందేమో చూడాలి.

Related Posts