తమిళంలో నటుడు, దర్శకుడు సుందర్ సి రూపొందించే ‘అరణ్మనై’ హారర్ సిరీస్ కు మంచి క్రేజుంది. ఈ సిరీస్ లో ఇప్పటికే మూడు చిత్రాలొచ్చాయి. ఇప్పుడు నాల్గవ చిత్రంగా ‘బాక్’ రాబోతుంది. ఈ మూవీలో సుందర్ సి లీడ్ రోల్ లో నటించగా.. బ్యూటిఫుల్ హీరోయిన్స్ తమన్నా, రాశీ ఖన్నా ఇతర ప్రధాన పాత్రలు పోషించారు. ఈ మూవీలో శ్రీనివాసరెడ్డి, వెన్నెల కిషోర్ ఇతర కీ రోల్స్ లో కనువిందు చేయబోతున్నారు.
బ్రహ్మపుత్ర నదీ అవతల తీరంలోని ప్రాంతాలను ఆక్రమించుకోవడానికి ఏ రాజులూ ఎలాంటి ప్రయత్నాలు చేయలేదు. అందుకు గల కారణాలలో, ఆ ప్రాంతంలో తిరిగే ‘బాక్’ అనే దెయ్యమేననేది ఒక కారణంగా చెబుతారు. ఆ ప్రాంతవాసులు ఆ దెయ్యం గురించి కథలు కథలుగా చెబుతారు. ఆ అంశాల ఆధారంగా ఈ సినిమాను రూపొందించాడట డైరెక్టర్ సుందర్ సి.
‘దెయ్యం అవతారం ఎత్తడం గురించి ఎప్పుడైనా విన్నారా? ఆ అవతారం పేరే ‘బాక్’.. మన ఊరికి కొత్తగా ఒక దెయ్యం రాబోతోంది తెలుసా? దాని పేరు ‘బాక్’.. అంటూ ఈ సినిమా ప్రమోషన్లో స్పీడు పెంచింది టీమ్. ఏప్రిల్ 26న ‘బాక్’ తెలుగు, తమిళం భాషల్లో విడుదలకు ముస్తాబవుతుంది.