దుబాయ్ వేదికగా చరిత్ర సృష్టించబోతున్న అల్లు అర్జున్

మన స్టార్ హీరోలు అభిమాన గణం పరంగా, ఇమేజ్ పరంగా అత్యున్నత శిఖరాలు అధిరోహిస్తున్నా.. ప్రభుత్వాల నుంచి, ఇతర సంస్థల నుంచి సరైన గుర్తింపు రావడం లేదనే కామెంట్స్ చాలా ఏళ్లుగా వినిపిస్తున్నవే. అయితే.. ఇప్పుడు అవార్డులతో పాటు ఇతర సత్కారాల్లోనూ మన హీరోలు మిగతా వాళ్లకు మించి దూసుకెళ్తున్నారు.

‘పుష్ప’తో పాన్ ఇండియా హిట్ కొట్టిన ఐకాన్ స్టార్ అల్లు అర్జున్.. ఇదే సినిమాలోని నటనకు గానూ ఏకంగా జాతీయ స్థాయిలో ఉత్తమ నటుడిగా అవార్డు అందుకున్నాడు. దశాబ్దాల తెలుగు సినిమా చరిత్రలో జాతీయ ఉత్తమ నటుడు అవార్డు అందుకున్న ఏకైక తెలుగు హీరోగా నిలిచాడు.

ఇప్పుడు బన్నీ మరో అరుదైన ఘనత సాధించాడు. ఎంతో ప్రతిష్ఠాత్మకంగా భావించే మేడమ్‌ టుస్సాడ్స్‌ మ్యూజియంలో అల్లు అర్జున్‌ మైనపు విగ్రహాన్ని ఏర్పాటు చేశారు. ఈ విగ్రహ ఆవిష్కరణ మార్చి 28వ తేదీన జరగనుంది. ఈ కార్యక్రమం కోసం అల్లు అర్జున్ కుటుంబంతో పాటు దుబాయ్‍ చేరుకున్నాడు. అక్కడ ఐకాన్ స్టార్ కి అద్భుతమైన రిసెప్షన్ దక్కింది. మరోవైపు అబుధాబిలో ఓ ప్రతిష్ఠాత్మక మ్యాగజైన్ కవర్ షూట్ లోనూ పాల్గొన్నాడు బన్నీ.

ఇప్పటికే ప్రభాస్, మహేష్ బాబు మైనపు విగ్రహాలు లండన్ లోని మేడమ్ టుస్సాడ్స్ మ్యూజియంలో ఏర్పాటు చేశారు. కానీ.. దుబాయ్ లోని మేడమ్ టుస్సాడ్స్ లో చోటు దక్కించుకున్న హీరో అల్లు అర్జున్ మాత్రమే. ఇప్పటికే దుబాయ్ నుంచి గోల్డెన్ వీసా అందుకున్న తొలి తెలుగు హీరోగానూ అల్లు అర్జున్ నిలిచాడు.

Related Posts