అందరి దృష్టీ ఆ సినిమాపైనే

క్రైమ్ థ్రిల్లర్స్ అనగానే అందరిలో ఓ ఆసక్తి ఉంటుంది. దానికి అన్ని వర్గాల ప్రేక్షకుల ఆదరణ లేకపోయినా ఓ రకమైన ఇంట్రెస్ట్ అయితే కనిపిస్తుంది. కాస్త నీట్ గాఉంది అనుకుంటే ఫ్యామిలీ ఆడియన్స్ కూడా చూసేందుకు ఇష్టపడతారు. దీనికి సస్పెన్స్, థ్రిల్లర్ వంటి అంశాలు కూడా యాడ్ అయితే ఖచ్చితంగా విజయం వచ్చే అవకాశాలుంటాయి.

ఈ మధ్య కాలంలో అలాంటి ఆసక్తిని కలిగించిన ట్రైలర్ హిడింబ. యాంకర్ కమ్ డైరెక్టర్ అయిన ఓంకార్ తమ్ముడు అశ్విన్ హీరోగా నటించిన ఈ చిత్రంలో నందిత శ్వేత హీరోయిన్. అనిల్ కన్నెగంటి డైరెక్ట్ చేసిన ఈ చిత్రాన్ని ఏకే ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ నిర్మించింది. నిజానికి ఈ సినిమా ఇప్పటికే విడుదల కావాల్సి ఉంది. కానీ ట్రైలర్ లోనే విపరీతమైన హింస కనిపించింది. క్రూరమైన హత్యలు ఉన్నాయి. దీంతో సెన్సార్ వారు చాలా కట్స్ చెప్పారట. వారికి నచ్చేలా మళ్లీ రీ ఎడిట్ చేసుకుని రావడంతో లేట్ అయింది. రీసెంట్ గా సెన్సార్ కూడా పూర్తయింది. దీంతో ఈ నెల 20న విడుదల చేయబోతున్నాం అని ప్రకటించారు మేకర్స్.


హింస కాస్త ఎక్కువగా ఉన్న మాట నిజమే అయినా.. ఈ సినిమా మాస్ ఆడియన్స్ కు బాగా కనెక్ట్ అవుతుందని నమ్ముతున్నారు. యాక్షన్ డోస్ కూడా భారీగానే ఉంది. ఇందుకోసం అశ్విన్ కండలగండడుగా మారాడు. నందిత కూడా ఇప్పటి వరకూ ఎప్పుడూ లేనంతగా హాట్ హాట్ గా రెచ్చిపోవడమే కాదు.. ఓసాంగ్ లో లిప్ లాక్ కూడా పెట్టేసింది. లిప్ లాక్ అనేది నందతితకు సినిమాల్లో ఫస్ట్ టైమ్. వీరి కెమిస్ట్రీ సినిమాకు ప్లస్ అవుతుందని చెబుతున్నారు.విశేషం ఏంటంటే.. ఈ సినిమా కథ ఆధునిక నగరాల నుంచి ఆదిమ మానవుల వరకూ వెళుతుంది. అక్కడ నరమాంస భక్షకులు కూడా ఉంటారు. తెలుగులో నరమాంస భక్షకుల నేపథ్యంలో పెద్దగా సినిమాలు లేవు. వచ్చినవన్నీ హాలీవుడ్ డబ్బింగ్ సినిమాలే. దీంతో హిడింబ పై ఓ క్యూరియాసిటీ అయితే ఉంది. దీనికి తోడు సినిమా కూడా బాగా వచ్చింది అనే టాక్ వినిపిస్తోంది. మరి ఈ మొత్తం పాజిటివిటీని వీళ్లు క్యాష్‌ చేసుకుంటారా లేదా అనేది చూడాలి.

Related Posts