ఆదిపురుష్‌ డౌన్ ఫాల్ ఇలా ..

ఇండియాస్ మోస్ట్ అవెయిటెడ్ మూవీ అనిపించుకుని.. భారీ ఓపెనింగ్స్ కూడా తెచ్చుకుని మొదటి ఆటకే డిజాస్టర్ అనిపించుకోవడం అంటే మాటలు కాదు. అది కూడా భారతీయులు ఎంతో గౌరవించే రామాయణ ఇతిహాసం నేపథ్యంలో వచ్చిన సినిమా.

యస్.. ప్రభాస్, కృతి సనన్ రాఘవ్, జానకిలుగా నటించిన ఆదిపురుష్‌ కు అదే జరిగింది. ఓమ్ రౌత్ డైరెక్ట్ చేసిన ఈమూవీ గ్రాఫిక్స్, విజువల్ ఎఫెక్ట్స్ గురించి విమర్శలు ఎదుర్కొంటుంది అని అంతా ముందే ఊహించారు. బట్ అసలు కంటెంట్ తోనే కోపం తెప్పించడం అనేది అరుదైన విషయమే అని చెప్పాలి. అసలు ఇప్పటి వరకూ ఇండియన్ స్క్రీన్ పై ఇంత చెత్తగా రామాయణాన్ని తీసిందీ వీళ్లే అని చెప్పాలి.

ఆఖరికి బుల్లితెరపైన కూడా అద్భుతమైన క్వాలిటీతో రూపొందించారు. అందుకే అడ్వాన్స్ బుకింగ్స్ గా వీకెండ్ వరకూ బాక్సాఫీస్ దగ్గర అదరగొట్టిన ఆదిపురుష్‌.. సోమ, మంగళ వారాల్లో మాత్రం పూర్తిగా తేలిపోయింది. ఏ రేంజ్ లో అంటే మొదటి మూడు రోజులతో పోలిస్తే ఏకంగా 80 -85 శాతం వరకూ తగ్గిపోయాయి కలెక్షన్స్.

నిజంగా ఈ డౌన్ ఫాల్ చూస్తే సినిమా ఎంత దారుణంగా ఉందో అర్థమైపోతుంది. మరి విడుదలైన శుక్రవారం నుంచి మంగళ వారం వరకూ ఈ చిత్రానికి వచ్చిన కలెక్షన్స్ ఎలా ఉన్నాయో చూద్దాం..

శుక్రవారం – ₹ 136 కోట్లు
శనివారం – ₹ 104 కోట్లు
ఆదివారం – ₹ 100 కోట్లు
సోమవారం – ₹ 35 కోట్లు
మంగళవారం – ₹ 20 కోట్లు

టోటల్ – ₹395 కోట్లు

అదీ మేటర్. విడుదలకు ముందు వెయ్యి కోట్లు, రెండు వేల కోట్లు అన్నారు. ఈ తీరు చూస్తోంటే అసలు బడ్జెట్ కూడా రికవర్ అయ్యేలా కనిపించడం లేదు. ఏదైనా దేవుడి పేరుతో ఆటలాడినా.. ఆటపాటలుగా సినిమాలు తీసినా ఇలాగే అవుతుందని మరోసారి ప్రూవ్ చేసింది ఆదిపురుష్‌.

Related Posts