గేమ్ ఛేంజర్ నుంచి మెగా అప్డేట్

గ్లోబల్ స్టార్ రామ్ చరణ్, భారీ చిత్రాల దర్శకుడు శంకర్ కలయికలో రూపొందుతోన్న చిత్రం ‘గేమ్ ఛేంజర్’. టాలీవుడ్ స్టార్ ప్రొడ్యూసర్ దిల్ రాజు అత్యంతం భారీ బడ్జెట్ తో తన సంస్థలో 50వ చిత్రంగా ఈ సినిమాని నిర్మిస్తున్నాడు. తమన్ సంగీతాన్నందిస్తున్న ఈ చిత్రం నుంచి ఫస్ట్ సింగిల్ ను దసరా కానుకగా విడుదల చేస్తారనే ప్రచారం జరిగింది.

అయితే ‘గేమ్ ఛేంజర్’ సింగిల్ కి సంబంధించిన అనౌన్స్ మెంట్ ను మాత్రమే దసరా కానుకగా అందించారు. దివాళి సందర్భంగా ఈ సినిమా నుంచి ‘జరగండి’ అంటూ సాగే గీతాన్ని విడుదల చేయబోతున్నారు. అందుకు సంబంధించి ఓ కలర్ ఫుల్ పోస్టర్ ను విడుదల చేసింది టీమ్. చుట్టూ రంగు రంగుల ఇళ్ల మధ్య.. లంబాడీ వేషధారణలో ఉన్న మహిళలు చరణ్ కి స్వాగతం చెబుతున్నట్టున్న ఈ పోస్టర్ ఆకట్టుకుంటుంది. రామ్ చరణ్ చేతిలో పుస్తకం పట్టుకున్న తీరును చూస్తుంటే ఈ మూవీలో ఐ.ఎ.ఎస్. ఆఫీసర్ గా కనిపించే అతనికి ఆ మహిళలు స్వాగతం చెబుతున్నట్టు ఉంది ఈ స్టిల్. శంకర్ స్టైల్ లోనే అత్యంత భారీగా కనిపిస్తున్న ఈ పోస్టర్ ఆద్యంతం ఆకట్టుకుంటుంది.

Related Posts