బాలకృష్ణతో ఛాన్స్ కొట్టేసిన త్రిష

రెండు దశాబ్దాల క్రితం ఇండస్ట్రీలోకి వచ్చింది త్రిష. చాలా తక్కువ టైమ్ లోనే ఓ రేంజ్ లో ఫేమ్ అయింది. దశాబ్దం పాటు టాప్ హీరోయిన్ గా ఓ వెలుగు వెలిగింది. ఆ టైమ్ లో తను చాలామంది యంగ్ స్టర్స్ కు మోస్ట్ ఫేవరెట్ గా మారింది. తెలుగుతో పాటు తమిళ్ లో టాప్ హీరోయిన్ అనే ట్యాగ్ ను బాగా ఎంజాయ్ చేసింది. నటన పరంగానూ చాలా సినిమాల్లో అద్భుతంగా మెప్పించింది. గ్లామర్ లోనూ తన తరం హీరోయిన్లోతో పోటీ పడింది. అయితే ఇరవైయేళ్ల తర్వాత కూడా అమ్మడి హవా తగ్గకపోవడం విశేషం.

ఆమధ్య త్రిష పనైపోయిందనుకున్నారు. తెలుగులో అవకాశాలు లేకపోయినా తమిళంలో మాత్రం వరుసగా ఫీమేల్ సెంట్రిక్ మూవీస్ చేసింది. అయితే తమిళంలో ‘96’ మూవీ త్రిష కి గ్రేట్ కమ్ బ్యాక్ గా నిలిచింది. వయసు పెరుగుతున్నా వన్నె తగ్గని అందంతో ఈ సినిమాలో కనిపించిన త్రిష వర్ఛస్సు కు ఫిదా కాని వారుండరు. ఇదే ఊపులో ‘పొన్నియిన్ సెల్వన్, లియో’ సినిమాలలో నటించింది.

అటు తమిళంతో పాటు ఇటు తెలుగులోరూ మళ్లీ దూకుడు పెంచుతుంది త్రిష. నటసింహం బాలకృష్ణతో బాబీ రూపొందిస్తున్న చిత్రంలో త్రిష ను కథానాయికగా తీసుకోనున్నారట.

గతంలో బాలకృష్ణతో ‘లయన్’ సినిమాలో హీరోయిన్ గా నటించింది త్రిష. ఇప్పుడు మరోసారి బాలయ్యతో ఆడిపాడనుంది. పైగా.. ఇప్పుడు నటసింహం హ్యాట్రిక్ హిట్స్ తో మంచి ఫామ్ లో ఉన్నాడు. సితార ఎంటర్ టైన్ మెంట్స్ ఈ చిత్రాన్ని నిర్మిస్తుంది.

Related Posts