జూన్ 14న రాబోతున్న సుధీర్ బాబు ‘హరోం హర‘

యంగ్ హీరో సుధీర్ బాబు లేటెస్ట్ మూవీ ‘హరోం హర‘. ఈ సినిమాలో సుధీర్ బాబు కి జోడీగా మాళవిక శర్మ నటించింది. మరో కీలక పాత్రలో సునీల్ కనిపించబోతున్నాడు. ఙ్ఞానశేఖర్ ద్వారక దర్శకత్వంలో శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర సినిమాస్ బ్యానర్ పై సుమంత్ జి.నాయుడు ఈ సినిమాని నిర్మిస్తున్నారు. ముందుగా ఈ చిత్రాన్ని సూపర్ స్టార్ కృష్ణ జయంతి కానుకగా మే 31న విడుదల చేస్తామని ప్రకటించారు. అయితే.. ఇప్పుడు రెండు వారాలు ఆలస్యంగా జూన్ 14న ‘హరోం హర‘ ప్రేక్షకుల ముందుకు రాబోతుంది.

మే 31న ఇప్పటికే పలు చిత్రాలు విడుదల తేదీ ఖరారు చేసుకుంది. దాంతో.. సోలో రిలీజ్ కోసం చూసిన ‘హరోం హర‘.. జూన్ 14 కి ఫిక్స్ అయినట్టు తెలుస్తోంది. ‘హరోం హర‘ కొత్త విడుదల తేదీని ప్రకటిస్తూ న్యూ పోస్టర్ రిలీజ్ చేసింది టీమ్. సుధీర్ బాబు చేతితో తుపాకీ పట్టుకుని ఉన్న ఈ పోస్టర్ ఆకట్టుకుంటుంది. ఆద్యంతం చిత్తూరు బ్యాక్ డ్రాప్ లో పీరియడ్ స్టోరీగా ‘హరోం హర‘ రాబోతుంది.

Related Posts