14 ఏళ్ల తర్వాత నాగార్జున-ప్రియమణి కాంబో

కింగ్ నాగార్జున, నేషనల్ అవార్డ్ యాక్ట్రెస్ ప్రియమణి కాంబినేషన్ లో వచ్చిన ‘రగడ’ చిత్రం మంచి విజయాన్ని సాధించింది. ఈ సినిమా వచ్చి 14 ఏళ్లవుతోంది. మళ్లీ చాలా గ్యాప్ తర్వాత నాగార్జున, ప్రియమణి కాంబినేషన్ సెట్ అయ్యిందట. సుబ్బు అనే నూతన దర్శకుడు తెరకెక్కించే చిత్రం కోసం వీరిద్దరూ కలిసి పనిచేయబోతున్నారట. ఆద్యంతం కోర్ట్ రూమ్ డ్రామాగా సాగే ఈ కథలో ఇద్దరూ లాయర్స్ గా కనిపించబోతున్నట్టు తెలుస్తోంది. ఇటీవల మలయాళంలో హిట్టైన ‘నెరు’లో లాయర్ పాత్రలో అదరగొట్టింది ప్రియమణి. నాగార్జునకి కూడా లాయర్ పాత్ర కొత్తేమీ కాదు.

‘నా సామిరంగ’ హిట్ తర్వాత నాగార్జున.. శేఖర్ కమ్ముల డైరెక్షన్ లో రూపొందుతోన్న మల్టీస్టారర్ లో నటిస్తున్నాడు. ఈ మూవీలో ధనుష్ తో కలిసి స్క్రీన్ షేర్ చేసుకుంటున్నాడు. ఈ సినిమా తర్వాత తన ప్రెస్టేజియస్ 100వ చిత్రానికి శ్రీకారం చుట్టనున్నాడు. కోలీవుడ్ డైరెక్టర్ నవీన్.. నాగ్ 100 ను తెరకెక్కించబోతున్నట్టు తెలుస్తోంది. ఈ రెండు సినిమాల తర్వాతే.. ప్రియమణితో కలిసి కోర్ట్ రూమ్ డ్రామాలో నటిస్తాడట నాగార్జున.

Related Posts