‘సలార్‘ తరహాలోనే ‘వార్ 2‘ స్టోరీ?

ఇద్దరు మంచి మిత్రులు.. కాలక్రమంలో బద్ధ శత్రువులుగా మారితే ఎలా ఉంటుంది? అనే తరహా కథలు ఇప్పటికే చాలా వచ్చాయి. దర్శకధీరుడు రాజమౌళి రూపొందించిన ‘ఆర్.ఆర్.ఆర్‘ కథాంశం కూడా ఇంచుమించు ఇదే విధంగా ఉంటుంది. ఇప్పుడు పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ ‘సలార్‘ స్టోరీ లైన్ కూడా ఇదే. లేటెస్ట్ గా ఎన్టీఆర్-హృతిక్ రోషన్ కాంబోలో రూపొందుతోన్న ‘వార్ 2‘ కూడా ఇదే తరహాలో ఉంటుందనే టాక్ ఇప్పుడు ఫిల్మ్ సర్కిల్స్ లో జోరుగా స్ప్రెడ్ అవుతోంది.

తారక్-హృతిక్ కాంబోలో బిగ్గెస్ట్ మల్టీస్టారర్ గా ‘వార్ 2‘ తెరకెక్కుతోంది. అయన్ ముఖర్జీ దర్శకత్వంలో యశ్ రాజ్ ఫిల్మ్స్ ఈ సినిమాని నిర్మిస్తోంది. ఈ మూవీలో ఎన్టీఆర్-హృతిక్ మంచి స్నేహితులుగా కనిపిస్తారట. ఆ తర్వాత వీరిమధ్య పొరపొచ్చాలు రావడం.. ఒకరికొకరు విరోధులుగా మారడం.. ఈ మూవీ సెంట్రల్ లైన్ అని తెలుస్తోంది. హై వోల్టేజ్ యాక్షన్ ఎంటర్ టైనర్ గా రూపొందుతోన్న ‘వార్ 2‘ ఇప్పటికే షూటింగ్ మొదలుపెట్టుకుంది. అయితే.. ఈ సినిమా షూట్ లో ఎన్టీఆర్ ఇప్పటివరకూ పాల్గొనలేదు. ఫిబ్రవరి చివరి వరకూ ‘దేవర‘ని ఫినిష్ చేయనున్న తారక్.. మార్చి నుంచి ‘వార్ 2‘ సెట్స్ లో అడుగుపెట్టనున్నాడట.

Related Posts