సస్పెన్స్‌ థ్రిల్లర్‌లో మదర్ సెంటిమెంట్‌ – దర్శకుడు రమాకాంత్ రెడ్డి

కలియుగం పట్టణంలో.. ఈ టైటిల్‌తో సినిమా రాబోతుంది. టైటిల్‌తో ఆడియెన్స్‌ అటెన్షన్ క్రియేట్ చేసిన ఈ మూవీ ని నాని మూవీ వర్క్స్, రామా క్రియేషన్స్ ఆధ్వర్యంలో విశ్వ కార్తికేయ, ఆయూషి పటేల్ హీరోహీరోయిన్లుగా రమాకాంత్ రెడ్డి కథ, డైలాగ్స్ ,స్క్రీన్ ప్లే, దర్శకుడిగా తెరకెక్కింది. ఈ చిత్రం మార్చి 29 న గ్రాండ్ గా రిలీజ్ కాబోతుంది. ఈ సందర్భంగా రమాకాంత్‌ రెడ్డి మీడియా సమావేశంలో చిత్ర విశేషాలను పంచుకున్నారు.

కలియుగంలో ఓ పట్టణంలోని మనుషులు ఎలా ఉన్నారనేది ఈ చిత్రంలో చూపించామన్నారు రమాకాంత్‌రెడ్డి. టైటిల్‌లో కనిపించిన మస్కిటో కాయిల్స్‌, రెంచ్‌ రెండింటికీ కథతో లింక్ ఉంటుందన్నారు. నల్లమల ఫారెస్ట్‌లో ఉన్న ఔషధ మొక్కలకు కథలో లింక్ ఉండటంతో నంద్యాల దగ్గర్లో ఉన్న ఫారెస్ట్ బ్యాక్‌డ్రాప్‌లో షూట్ చేసామన్నారు. ఈ సినిమాలో సస్పెన్స్‌ థ్రిల్లర్ ఎలిమెంట్స్ తో పాటు మదర్ సెంటిమెంట్ బలంగా ఉందన్నారు.

హీరో కథ మెంటల్ హాస్పిటల్‌ దగ్గర్నుంచే మొదలవుతుందన్నారు. బయట చాలామంది తండ్రులు సోషియో ఫోబియాతో ఉన్నారు. నా కొడుకు ఇలా ఉండాలి, ఇది చేయాలి, సమాజం ఏం అంటుందో అనే ఆలోచిస్తారు. పిల్లల ఫీలింగ్స్ పట్టించుకోరు. వాటికి తగ్గట్టు కథలో ఆ పాయింట్ కూడా ఉంటుంది. గతంలో నేను జాబ్ చేసేటప్పుడు బెంగుళూరు నుంచి బస్సులో ఊరికి వస్తుంటే ఓ ప్రగ్నెంట్ లేడీ సైకాలజీకి చెందిన బుక్ చదువుతుంది. నేను ప్రగ్నెన్సీ సమయంలో ఇలాంటివి చదవకూడదు అని చెప్తే, ఆమె.. మేం ఏం చేయాలో మాకు తెలుసు అంది. ఇక నేను మాట్లాడలేదు. ట్రావెలింగ్ మొత్తం ఆమె ఆ బుక్ చదువుతుంది. అప్పుడే ఈ కథ ఆలోచన వచ్చింది. అలాగే బయట పిల్లలు ఎలా పెరుగుతున్నారో ఇటీవల చూస్తున్నాం. దాంతో ఈ కథ రాసుకున్నానన్నారు.

డిగ్రీ చదువుకునేటప్పుడే… కోడిరామకృష్ణ గారు అరుంధతి సినిమా షూట్ చేస్తున్నారు. ఆ షూట్‌లో అసిస్టెంట్ గా జాయిన్‌ అయ్యానన్నారు. వైజాగ్‌లో చదువుతూ.. హైదరాబాద్ వచ్చి వెళ్తూ సినిమాల్లో ట్రై చేసానన్నారు. కరోనా లాక్‌డౌన్‌ టైమ్‌లో ఫిక్స్‌ అయి.. కరోనా తర్వాత పూర్తిగా సినిమాకే కేటాయించా. కోడిరామకృష్ణ గారి దగ్గర్నుంచి చాలా మంది దర్శకుల డైరెక్షన్‌ డిపార్ట్‌మెంట్‌లో పనిచేసానన్నారు.
ముందు ఒకటి రెండు సినిమాలు చేసిన కొంతమంది హీరోలను అప్రోచ్ అయ్యాను. అయితే ఇందులోని ఇంటెన్స్ క్యారెక్టర్ ని వాళ్ళు చెయ్యలేమన్నారు. అప్పుడు విశ్వ ప్రొఫైల్ వచ్చింది. స్టోరీ విన్నాక ధైర్యంగా చేస్తా అని చెప్పాడు. నాకు కూడా అతనిలో ఆ కాన్ఫిడెన్స్ నచ్చిందన్నారు.

సినిమాలో ఆయుషి పటేల్ హీరోయిన్. కొత్తమ్మాయి, తెలుగమ్మాయి. గ్లామర్ పరంగా కాకుండా సినిమాలో కీ రోల్ ప్లే చేస్తుంది. ఇంకో హీరోయిన్ చిత్రశుక్ల కూడా ఉంది. పోలీస్ రోల్ లో కనిపిస్తుందన్నారు.
నిర్మాతలకి ఎవరికీ సినిమా బ్యాక్ గ్రౌండ్ లేదు. ఒక ప్రొడ్యూసర్ మా కజిన్ మహేష్ . నేను ఇలా సినిమాల్లో తిరుగుతున్నప్పుడు అతన్ని కలిసి కథ చెప్పి ఇలా చేయాలనుకుంటున్నాను అంటే కథ నచ్చి మనమే చేద్దాం అన్నాడు. ఒక్కరే అయితే నిర్మాతగా కష్టం అని ఆ తర్వాత కథ నచ్చి ఓబుల్ రెడ్డి గారు, రమేష్ గారు తోడయ్యారు. ఓబుల్ రెడ్డి గారికి చాలా ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూట్స్ ఉన్నాయి. ఆయన కథ విన్న వెంటనే ఒప్పేసుకున్నారు అని చెప్పారు రమాకాంత్‌.

ఈ సినిమాలో నాలుగు సాంగ్స్ ఉన్నాయి. ఒకటి మదర్ సాంగ్, ఒకటి లవ్ సాంగ్, ఒకటి ఐటెం సాంగ్, టైటిల్ సాంగ్ ఉన్నాయి. రెండు పాటలు భాస్కరభట్ల గారు రాసారు. టైటిల్ సాంగ్, ఐటెం సాంగ్ చంద్రబోస్ గారు రాసారు. ఏది తీసినా ఆడియన్స్ ఒప్పుకోకపోతే డైరెక్టర్ సక్సెస్ అవ్వడు. మాస్, థ్రిల్లర్, లవ్.. ఏ జానర్ తీసినా ప్రేక్షకులని మెప్పించాలి. మున్ముందు దీనికే సీక్వెల్ కలియుగ నగరంలో అని తీస్తున్నానన్నారు దర్శకుడు రమాకాంత్ రెడ్డి.

Related Posts