అల్లు అర్జున్ కంటే ముందే.. త్రివిక్రమ్ మరో సినిమా?

‘గుంటూరు కారం‘ తర్వాత మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ ఎవరితో సినిమా చేయబోతున్నాడు అనే దానిపై ఇప్పటికే ఓ క్లారిటీ ఉంది. అల్లు అర్జున్ తో ఆల్రెడీ తన ఫోర్త్ కాంబినేషన్ మూవీని కొన్ని నెలల క్రితమే ప్రకటించాడు. అయితే.. గతంలో బన్నీతో చేసిన చిత్రాలకంటే భిన్నంగా ఈ సినిమా రూపొందబోతుంది. ఓ భారీ సోషియో ఫాంటసీ స్టోరీగా అల్లు అర్జున్ చిత్రాన్ని తీర్చిదిద్దనున్నాడట త్రివిక్రమ్. అందుకే.. అల్లు అర్జున్, త్రివిక్రమ్ సినిమా పట్టాలెక్కడానికి ఇంచుమించు సంవత్సరానికి పైగానే సమయం పట్టనుంది.

ఒకవైపు అల్లు అర్జున్ సినిమాకి సంబంధించి ప్రీ ప్రొడక్షన్ పనులను పూర్తి చేస్తూనే.. ఈ గ్యాప్ లో మరో సినిమాని ప్లాన్ చేస్తున్నాడట మాటల మాంత్రికుడు. గతంలో నితిన్ తో తెరకెక్కించిన ‘అ.. ఆ‘ స్టైల్ లో ఓ కంప్లీట్ ఫ్యామిలీ ఎంటర్ టైనర్ ను తెరకెక్కించే సన్నాహాల్లో ఉన్నాడట. ఆ చిత్రంకోసం రామ్ లేదా నాని లలో ఒకరిని కథానాయకుడిగా తీసుకునే ఆలోచనలో ఉన్నాడట. త్వరలోనే.. ఈ ప్రాజెక్ట్ పై ఓ క్లారిటీ వచ్చే అవకాశం ఉంది.

Related Posts