హాఫ్‌ బేక్డ్ డైరక్టర్లను నాని పక్కన పెడతారా

యు అండ్‌ ఐ 14 ఇయర్స్ ఆఫ్‌ లవ్‌ అంటూ ఇండస్ట్రీలో తన 14 ఏళ్ల జర్నీని గుర్తుచేసుకున్నారు హీరో నాని. 2008లో అష్టాచమ్మా సినిమాతో హీరోగా పరిచయమయ్యారు నాని. మోహన కృష్ణ ఇంద్రగంటి దర్శత్వంలో తెరకెక్కిన ఈ సినిమా అప్పట్లో ప్రేక్షకాదరణ పొందింది. నాని నేచురల్‌ పెర్ఫార్మెన్స్ కి కొత్తగా ఫ్యాన్స్ క్రియేట్‌ అయ్యారు.ఇండస్ట్రీలో గాడ్‌పాదర్‌ లేకుండా ఎదిగిన హీరోల్లో ఆయన ఒకరు. తన 14 ఏళ్ల జర్నీని నాని గుర్తుచేసుకున్న పోస్ట్ కి రిప్లై ఇచ్చిన చాలా మంది ఇదే విషయాన్ని ప్రస్తావించారు.పరిశ్రమలో ఔట్‌సైడర్‌గా ఎంటర్ అయి, నేచురల్‌ స్టార్‌ అని అనిపించుకోవడం అంత తేలిక కాదు.

ఎన్నెన్నో సినిమాలు చేశావు. ప్రయోగాలు చేయడానికి ట్రై చేశావు. కొన్ని సక్సెస్‌ అయ్యాయి. కొన్ని ఫెయిల్యూర్‌ అయ్యాయి. అయినా పట్టుదలతో ముందుకెళ్తున్నావు. కంటెంట్‌ డ్రైవెన్‌ సినిమాలు చేయి. అవే నీకు సూట్‌ అవుతాయి అని ఎవరికి తోచిన సలహాలు వాళ్లు ఇస్తున్నారు.హాఫ్‌ బేక్డ్ కొత్త డైరక్టర్లను పక్కనపెడితే హిట్‌ ఆటోమేటిగ్గా వస్తుందని సలహాలు ఇచ్చిన వారు కూడా ఉన్నారు. ఇప్పుడు వాళ్ల మాటలను విని నాని కొత్త దర్శకులతో సినిమాలు చేయడం మానేస్తారా? మానేయకపోవచ్చు కానీ, ముందూ వెనుక ఒకటికి నాలుగు సార్లు ఆలోచించుకుని అడుగేస్తారన్నది ఫ్యాన్స్ ఆశ.

ప్రస్తుతం దసరా సినిమాలో నటిస్తున్నారు నాని. బ్యాక్‌ గ్రౌండ్‌లో సిల్క్ స్మిత బొమ్మ, ఓ మాదిరిగా రగ్డ్ లుక్‌లో కూర్చున్న నాని పిక్‌ ఉన్న దసరా లుక్‌ ఇన్‌స్టంట్‌గా వైరల్‌ అయింది. కీర్తీ సురేష్‌ దసరాలో హీరోయిన్‌. సింగరేణి నేపథ్యంలో జరిగే కథ ఇది. ధరణి అనే రోల్‌ చేస్తున్నారు నాని. చూడ్డానికి మాసిన గడ్డంతో మాసీగా కనిపిస్తున్నారు. వచ్చే ఏడాది మార్చి 30న విడుదల కానుంది దసరా. శ్రీకాంత్‌ ఓదెల డైరక్ట్ చేస్తున్నారు. నెక్స్ట్ అప్‌కమింగ్‌ డైరక్టర్లను నమ్మాలా వద్దా అనేది నానికి ఈ సినిమాతో క్లియర్‌ అవుతుంది.

Related Posts