ad

హీరోయిన్ కొత్తగా వచ్చిన పాతబడిపోగానే అందరూ పాడుకునే సాంగ్.. అందమైన భామలూ.. లేత మెరుపు తీగలు కావాలి అని. ఆడయన్స్ సంగతేమో కానీ.. సినిమా వాళ్లు మాత్రం ఎప్పుడూ కొత్త మొహాల కోసమే చూస్తుంటారు. ఫ్రెష్ కాంబో అనిపించడం కోసమో లేక నిజంగానే అందమైన భామలు కనిపిస్తే వీరిని పరిచయం చేయాలనే తాపత్రయమో కానీ.. ఇప్పుడు తెలుగులో సరికొత్త ఫేస్ లు హల్చల్ చేస్తున్నాయి. వీళ్లు వచ్చిన యేడాది దాటినా.. రాబోయే రోజుల్లో టాలీవుడ్ లో తమదైన ముద్ర వేస్తారు అని ప్రూవ్ చేసుకున్నారు. మరి ఆ అందమైన భామలెవరో ఈ స్పెషల్ లో చూద్దాం..ఉప్పెనతో ఓవర్ నైట్ ఫేమ్ అయిన బ్యూటీ కృతిశెట్టి. ఉప్పెన తర్వాత శ్యామ్ సింగరాయ్, బంగార్రాజు కూడా హిట్ కావడంతో.. అమ్మడు ఓ రేంజ్ లో దూసుకుపోతోంది. వరుసగా సినిమాలు చేస్తోంది. లేటెస్ట్ గా వచ్చిన వారియర్ సైతం ఓ మోస్తరుగా ఆకట్టుకుంటోంది. టాలీవుడ్ యంగ్ స్టర్స్ కు ఫస్ట్ ఆప్షన్ గా మారింది కృతి.

ప్రస్తుతం మాచర్ల నియోజకవర్గం, ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి, నాగ చైతన్య సరసన వెంకట్ ప్రభు డైరెక్షన్ లో బై లింగ్వుల్ మూవీ చేస్తోంది. వీటితో పాటు తమిళ్ లో సూర్యకు జోడీగా ఓ మూవీకి సైన్ చేసింది. ఈ ప్రాజెక్ట్స్ అన్నీ ప్రామిసింగ్ గా కనిపిస్తున్నాయి. అంటే రాబోయే రోజుల్లో కృతిశెట్టి టాలీవుడ్ టాప్ లేపే ఛాన్స్ ఉందన్నమాట.కృతిశెట్టికి గట్టి పోటీ ఇచ్చేలా కనిపిస్తోన్న మరో కన్నడ సోయగం శ్రీ లీల. పెళ్లి సందడి సినిమాతో తెలుగు ప్రేక్షకులను మనసులు గెలిచిన శ్రీ లీల కూడా వరుసగా సినిమాలు చేస్తోందిప్పుడు. ఇప్పటికే రవితేజతో ఓ మూవీకి ఓకే చెప్పిన ఈ భామ.. నవీన్ పోలిశెట్టితో అనగనగా ఒక రాజు, నితిన్ కొత్త సినిమాతో పాటు కన్నడలో ఓ మూవీకి సైన్ చేసింది. శ్రీ లీల కాస్త హైపర్. అందుకే తను కూడా టాలీవుడ్ టాప్ హీరోయిన్స్ లిస్ట్ లో ప్లేస్ సంపాదించుకుంటుందనే చెబుతున్నారు.

, , , , , , , , ,