మోహన్ బాబును పట్టించుకునేవారేరీ..?

సినిమా ఇండివిడ్యువల్ పరిశ్రమ. ప్రభుత్వాల నుంచీ మరీ ఏమంత గొప్ప రాయితీలు లేవు ఈ పరిశ్రమకు. మొదట్లో ఇక్కడ భూములు ఇచ్చారు. అంతే తప్ప ఇతరత్రా అంశాలన్నీ నిర్మాతలు, మేకర్స్ మాత్రమే ఫేస్ చేస్తున్నారు. పైగా కోట్ల రూపాయల ట్యాక్స్ కడుతున్నారు. అలాంటి పరిశ్రమను ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కుదేలు చేసేందుకు కుయుక్తులు పన్నింది. టికెట్ రేట్లను 30యేళ్ల క్రితానికి తగ్గించారు. థియేటర్స్ ఓనర్స్ ను ఇబ్బంది పెట్టారు. సెకండ్ లాక్ డౌన్ తర్వాత నుంచి మరీ ఎక్కువగా వేధింపులకు గురి చేస్తున్నారు. అయినా తట్టుకుని సినిమాలు విడుదల చేస్తున్నారు ప్రదర్శిస్తున్నారు. టికెట్ రేట్ల అంశం గురించి ప్రభుత్వానికి విన్నవించేందుకు ఎన్ని ప్రయత్నాలు చేసినా ముఖ్యమంత్రి నుంచి పెద్దగా స్పందన రాలేదు. మంత్రి పేర్ని నాని మాత్రమే పైపై పూత మాటలు చెబుతున్నాడు తప్ప పని కావడం లేదు.
అయితే ఇండస్ట్రీని నుంచి ఇప్పటికే చాలామంది ఈ విషయమై ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. కానీ మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్ గా ఉన్న మంచు విష్ణు కానీ, ఆయన తండ్రి సీనియర్ నటుడు, నిర్మాత, విద్యావేత్త, క్రమశిక్షణ సంఘం సభ్యుడు అయిన మోహన్ బాబు కూడా ఏం మాట్లాడలేదు. ఈ విషయంలో విమర్శలు పెరిగాయని లేటెస్ట్ గా ఓ లేఖను వదిలాడు మోహన్ బాబు. ఆ లేఖలో ఆయన ప్రభుత్వాన్ని ‘భిక్ష’అడుగుదాం అని ప్రస్తావించడం చాలామందికి కోపం తెప్పించింది. అది భిక్ష కాదు కదా..?
అంతేకాక.. మోహన్ బాబుది కేవలం మేకపోతు గాంభిర్యంగానే చూస్తున్నారు చాలామంది. తను మా ప్రెసిడెంట్ గా ఉన్న టైమ్ లో అప్పటి ముఖ్యమంత్రి రాజశేఖర్ రెడ్డిని కలిసి సమస్యలు పరిష్కరించుకున్నామని చెప్పాడు. అందుకే అందరం కలిసి ముందు ఓ మీటింగ్ పెట్టుకుని.. సమస్యలు మాట్లాడుకుని ఇప్పుడు జగన్ దగ్గరకు వెళ్లి వేడుకుందాం అని చెప్పడం.. చూస్తే ఆయన చెప్పుకునే వ్యక్తిత్వానికి వాస్తవానికి చాలా వ్యత్యాసం కనిపిస్తుంది.
నిజానికి వీళ్లు జగన్ కు బంధువులు. అది ఈ మధ్యే కుదిరిన బంధుత్వం. కానీ దశాబ్దాలుగా పోషిస్తోన్న పరిశ్రమకు ప్రాబ్లమ్ వస్తే మాత్రం స్పందించరు. అందుకు కారణం మోహన్ బాబు విద్యా సంస్థలే అంటారు కొందరు. ప్రభుత్వాన్ని ప్రశ్నించినా.. రాయితీలు అడిగినా.. తమ విద్యా సంస్థలకు ఇబ్బంది తప్పదు అని తెలుసు. అందుకే ఇన్నాళ్లూ మౌనంగా ఉండి.. సమస్య ఓ కొలిక్కి వస్తోన్న టైమ్ లో లేఖల డ్రామాకు తెరతీశారు అంటూ కొందరు ఇండస్ట్రీ పెద్దలు బహిరంగంగానే విమర్శిస్తున్నారు.

Related Posts