సురేష్ బాబుకు జగన్ పై కోపమా లేక వ్యాపారమేనా

స్టార్ ప్రొడ్యూసర్ గా టాలీవుడ్ లో ఒక లెగసీ ఉన్నవాడు సురేష్ బాబు. లెజెండరీ ప్రొడ్యూసర్ రామానాయుడు తనయుడిగా ఆయన వారసత్వాన్ని నిర్మాతగా కొనసాగిస్తున్నాడు. మరోవైపు డిస్టిబ్యూటర్ గాను తిరుగులేకుండా ఉన్నాడు. దీనికి తోడు ఆ నలుగురు అంటూ పరిశ్రమ గురించి చెప్పే బ్యాచ్ లోను ఒకడుగా అప్పుడప్పుడు తిట్లూ తింటుంటాడు. ఐతే కరోనా కాలం నుంచి ఇండస్ట్రీ కి మరో సురేష్ బాబు కనిపిస్తున్నాడు. వరుసగా సినిమాలు చేస్తున్న వాటిని థియేటర్స్ లో విడుదల చేయడం లేదు. ఇందుకు మరో కారణం ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి తీసుకున్న టికెట్ రేట్ల తగ్గింపు వ్యవహారం కూడా ఒక కారణం. అలాగే ఆయన కోపం కూడా ఉందని చెబుతారు. రామానాయుడు బ్రతికి ఉన్నప్పుడు అప్పటి ముఖ్యమంత్రి రాజశేఖర్ రెడ్డి నుంచి విశాఖపట్నం లో ల్యాండ్ తీసుకుని స్టూడియో నిర్మాణం చేపట్టాడు. చాలా వరకు పూర్తి చేసాడు. కానీ ఇప్పుడు జగన్ ముఖ్యమంత్రి అయ్యాక సురేష్ బాబు తో విబేధాలు వచ్చాయి. దీంతో అక్కడి స్టూడియో స్థలాన్ని ప్రభుత్వం ఆక్రమించుకోవాలని ప్రయత్నించింది. వీటికి తోడు సురేష్ ముందు నుంచి తెలుగుదేశం పార్టీ అభిమాని. ఇవన్నీ కలిపి జగన్ స్టూడియో స్థలం పై కన్నేయడానికి కారణం ఐయ్యింది.
ఐతే టికెట్ రేట్ల వ్యవహారం పై అప్పట్లో ఇండస్ట్రీ నుంచి జగన్ ను కలిసిన టీమ్ లో సురేష్ కూడా ఉన్నాడు. అప్పుడు ఏమైందో కానీ ఇక తన సినిమాలను థియేటర్స్ రిలీజ్ చేయను అని ఇన్ డైరెక్ట్ గా శపథం చేసాడు అంటున్నారు. అందుకే తన బ్యానర్ లో వచ్చే చిత్రాలను వోటిటి లోనే విడుదల చేస్తున్నాడు. గాథలో నారప్ప చిత్రాన్ని అలాగే అమ్మేశాడు. రీసెంట్ గా వచ్చిన దృశ్యం సీక్వెల్ లు కూడా ఓ టి టి కే ఇచ్చాడు.
అలాగే తన నెక్స్ట్ మూవీ శాకినీ ఢాకిని మూవీస్ ను కూడా ఓ టి టి కే ఇస్తున్నాడు. మరో వైపు భారీ బడ్జెట్ రూపొందిన విరాట పర్వము మూవీ ని కూడా అలాగే ఇద్దామంటే ఈ సినిమాకు మరో పార్టనర్ ఉన్నడదు. లేదంటే విరాట పర్వం కూడా ఎప్పుడో ఓ టి టి లో వచ్చేది అంటున్నారు.
మోతంగా ఏ పి లో టిక్కెట్ రేట్ల విషయం తేలేదాక ఆగకుండా .. పరిశ్రమ మనుగడ గురించి ఆలోచించాల్సిన బాధ్యత ఉన్న పట్టించుకోకుండా ఇలా చేయడం ఎవరికి నచ్చడం లేదు. కానీ ఆయన మాత్రం ఎవరి మాట వినడం లేదు. పైగా జగన్ బతిమాలడం అనే కాన్సెప్ట్ కే కోపం వ్యక్తం చేస్తున్నాడట. మరి పెద్ద నిర్మాతలే ఇలా చేస్తే ఇకపై చిన్న సినిమాలతోనే పరిశ్రమ మనుగడ కొనసాగుతుందా అనేది పెద్దలే ఆలోచించాలి .

Related Posts