శేఖర్ కమ్ముల, ధనుష్ సినిమా ఏమైందీ..?

బలమైన కథలతో ఆకట్టుకునే దర్శకుడు శేఖర్ కమ్ముల. తన సినిమాతో సమాజానికి ఏదో ఒక సందేశం ఇస్తాడు. లేదంటే కనీసం వల్గారిటీ అస్సలు లేకుండా చూసుకుంటాడు. హెల్దీ మూవీస్ తో ఫ్యామిలీ ఆడియన్సెస్ కు ఫేవరెట్ డైరెక్టర్ గా మారాడు శేఖర్. ఇక రీసెంట్ గా ఫిదా తర్వాత లవ్ స్టోరీతో మరో సూపర్ హిట్ అందుకున్న శేఖర్ .. ఈ సారి కోలీవుడ్ సూపర్ స్టార్ ధనుష్ తో సినిమా చేయబోతున్నాడు. ఇది ప్యాన్ ఇండియన్ ప్రాజెక్ట్. ప్యాన్ ఇండియన్ లెవల్లో ధనుష్ ఆల్రెడీ ఫేమసే. సో శేఖర్ కమ్ములకు మాత్రం ఇది ఫస్ట్ ప్యాన్ ఇండియన్ ప్రాజెక్ట్. అందుకే చాలామంది ఈ కాంబినేషన్ పై ఆసక్తిగా చూశారు. ధనుష్ ఫస్ట్ తెలుగు స్ట్రెయిట్ మూవీగా దీన్ని అభివర్ణించారు. బట్.. తర్వాత సితార బ్యానర్ లో వెంకీ అట్లూరి డైరెక్షన్ లో కూడా సినిమా ఉంటుందని అనౌన్స్ చేశారు. అయినా ముందుగా శేఖర్ సినిమా వస్తుందని భావించారు. మరి ఏమైందో కానీ.. లేటెస్ట్ గా సితార బ్యానర్ లో సినిమా ప్రారంభం అయింది. సినిమా పేరు ‘సార్’అని పెట్టారు.
మరి ధనుష్, శేఖర్ కమ్ముల సినిమా గురించిన అప్డేట్ మాత్రం ఇప్పటి వరకూ రాలేదు. అంటే అసలు ఉందా లేదా అనే డౌట్స్ కూడా పరిశ్రమలో వినిపిస్తున్నాయి. నిజానికి శేఖర్ కమ్ముల తన సినిమాల గురించి ఎప్పుడూ లో ప్రొఫైల్ మెయిన్టేన్ చేస్తుంటాడు. మరి నిర్మాణ సంస్థైనా ఏదో ఒక అప్డేట్ ఇవ్వాలి. లేదా ధనుష్ అయినా ఓ ట్వీట్ చేయొచ్చు. ఈ రెండూ కాకుండా అసలు ఏ వార్తా లేదంటే మరి ప్రాజెక్ట్ ఉందా లేదా అనే అనుమానాలు సహజంగానే వస్తాయి కదా..?
మరోవైపు ఇది తెలంగాణ సాయుధ పోరాట నేపథ్యంలో సాగే కథ అనీ.. హిస్టారికల్ బ్యాక్ డ్రాప్ కాబట్టి కథ విషయంలో ఎక్కువ జాగ్రత్తలు తీసుకుంటున్నారు అనీ.. ఈ కారణంగానే ప్రాజెక్ట్ ఆలస్యం అవుతుందీ అంటూ కొన్ని వార్తలు వస్తున్నాయి. మరి వాటినే సినిమా టీమ్ అయినా అనౌన్స్ చేయొచ్చు కదా..? ఏదేమైనా ధనుష్ ఫస్ట్ తెలుగు మూవీ శేఖర్ కమ్ములతో అనుకుంటే కాకుండా పోయింది. ఫస్ట్ కాకపోయినా.. అసలు ఉంటుందా లేదా అనే క్లారిటీ అయినా ఇస్తే బావుంటుందేమో..

Related Posts