“మీట్ క్యూట్”ఎంథాలజీ టీజర్ రేపు విడుదలవాల్ పోస్టర్ సినిమా బ్యానర్ పై వైవిధ్యమైన చిత్రాలను రూపొందిస్తున్న నేచురల్ స్టార్ నాని, ప్రశాంతి తిపిర్నేని నిర్మిస్తున్న మరో యూనిక్ ప్రాజెక్ట్ “మీట్ క్యూట్”. నాని సోదరి దీప్తి గంటా ఈ చిత్రంతో దర్శకురాలిగా పరిచయం అవుతున్నారు. “మీట్ క్యూట్” ఐదు కథలతో క్యూట్ ఎంథాలజీగా ఉండబోతోంది. ఒక కథలో సత్యరాజ్ కీలక పాత్ర పోషిస్తుండగా.. రోహిణి మొల్లేటి, అదా శర్మ, వర్షా బొల్లమ్మ, ఆకాంక్ష సింగ్, రుహాని శర్మ, సునైనా, సంచిత పూనాచ ఫీమేల్ లీడ్స్ గా, అశ్విన్ కుమార్, శివ కందుకూరి , దీక్షిత్ శెట్టి, గోవింద్ పద్మసూర్య, రాజా కథానాయకులుగా నటిస్తున్నారు.

ప్రముఖ స్ట్రీమింగ్ ప్లాట్‌ఫారమ్ సోనీ లివ్ ఈ ఎంథాలజీ హక్కులను పొందింది, త్వరలో ప్రత్యేకంగా ఓటిటి ప్లాట్‌ఫారమ్‌లో స్క్రీనింగ్ చేయనుంది. ఓ క్యూట్ పోస్టర్ ద్వారా మేకర్స్ అదే విషయాన్ని ప్రకటించారు. ఈ చిత్రం టీజర్‌ను రేపు విడుదల చేయనున్నారు. ఈ ఎంథాలజీ అంతా అందమైన యాదృచ్ఛిక సంఘటనలు, గొప్ప సంభాషణలు, హార్ట్ వార్మింగ్ క్షణాల సమాహారం.

ఈ ఎంథాలజీలో ప్రముఖ తారాగణంతో పాటు, ప్రతిభావంతులైన సాంకేతిక నిపుణుల పని చేస్తున్నారు. వసంత్ కుమార్ సినిమాటోగ్రఫీ అందించగా, విజయ్ బుల్గానిన్ సంగీత సమకూర్చారు. అవినాష్ కొల్లా ప్రొడక్షన్ డిజైనర్ గా, గ్యారీ బిహెచ్ ఎడిటర్ గా పని చేస్తున్నారు.

తారాగణం – సత్యరాజ్, రోహిణి, అదా శర్మ, వర్ష బొల్లమ్మ, ఆకాంక్ష సింగ్, రుహాని శర్మ, సునైనా, సంచిత పూనాచా, అశ్విన్ కుమార్, శివ కందుకూరి, దీక్షిత్ శెట్టి, గోవింద్ పద్మసూర్య, రాజా

రచన, దర్శకత్వం: దీప్తి గంటా
నిర్మాత: ప్రశాంతి తిపిర్నేని
సమర్పణ: నాని
బ్యానర్: వాల్ పోస్టర్ సినిమా
డీవోపీ: వసంత్ కుమార్
సంగీతం: విజయ్ బుల్గానిన్
ప్రొడక్షన్ డిజైనర్: అవినాష్ కొల్లా
ఎడిటర్: గ్యారీ బిహెచ్
లిరిక్స్ : కెకె
పీఆర్వో: వంశీ-శేఖర్
ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: ఎస్. వెంకటరత్నం (వెంకట్)

Related Posts