దర్శకుడిగా విశ్వకు తొలిచిత్రం విశేష స్పందన!!

తెలుగు ఫిల్మ్ డైరెక్టర్స్ అసోసియేషన్
ఆత్మీయ సత్కారం!!

దర్శకుడిగా విశ్వకు ఉజ్వల భవిష్యత్
ఉందని ప్రశంసలు!!

పరిచయ చిత్రంతోనే ఎంతో ప్రతిభ కనబరచిన "గీత" చిత్ర దర్శకుడు విశ్వకు చాలా మంచి భవిష్యత్ ఉందని కితాబిచ్చారు పలువురు దర్శకులు. ప్రేక్షకుల నుంచి మాత్రమే కాకుండా విమర్శకుల నుంచి సైతం విశేష ప్రశంసలు అందుకుంటున్న "గీత" చిత్రాన్ని తెలుగు దర్శకుల సంఘం సభ్యుల కోసం హైదరాబాద్ లోని ప్రసాద్ ల్యాబ్ లో ప్రత్యేకంగా ప్రదర్శించారు. ఈ ప్రదర్శనకు పెద్ద సంఖ్యలో విచ్చేసిన దర్శకులు చిత్ర నిర్మాత ఆర్.రాచయ్య, దర్శకుడు విశ్వలపై ప్రశంసల వర్షం కురిపించారు. అప్పట్లో గ్లామర్ రోల్స్ కు పరితమైన రాధతో "ఆత్మబంధువు" చిత్రం తీసి మెప్పించిన భారతీ రాజా కోవలో... గ్లామర్ హీరోయిన్ హెబ్బా పటేల్ నుంచి అద్భుత నటన రాబట్టుకున్నారని కొనియాడారు. దర్శకుడు విశ్వను శాలువాతో సత్కరించి పూల మొక్కను కానుకగా ఇచ్చారు. దర్శకత్వ శాఖలో తలలు పండిన ఎందరో మేధావులు "గీత" చిత్రాన్ని ఇంతగా మెచ్చుకోవడం ఎప్పటికీ మర్చిపోలేనని పేర్కొన్న విశ్వ... తొలి ప్రయత్నంలో దొర్లిన తేలికపాటి తప్పులు రెండో చిత్రంలో జరగకుండా తగిన జాగ్రత్తలు తీసుకుంటానని అన్నారు.

తన గురువు వి.వి.వినాయక్, తనకు అవకాశం ఇచ్చిన నిర్మాత ఆర్.రాచయ్యలకు ఆజన్మాంతం రుణపడి ఉంటానని తెలిపారు. గ్రాండ్ మూవీస్” పతాకంపై ఆర్.రాచయ్య నిర్మించిన విభిన్న కథాచిత్రం “గీత”తో దర్శక సంచలనం వి.వి.వినాయక్ ప్రియశిష్యుడు విశ్వ దర్శకుడిగా పరిచయమయ్యాడు. “మ్యూట్ విట్నెస్” అన్నది ఈ చిత్రానికి ఉప శీర్షిక. ఈనెల 14 న ప్రపంచవ్యాప్తంగా విడుదలైన ఈ చిత్రానికి మంచి స్పందన వస్తోంది.క్రేజీ కథానాయిక హెబ్బా పటేల్ టైటిల్ రోల్ ప్లే చేసిన ఈ చిత్రంలో ప్రముఖ నటుడు సునీల్ ముఖ్యపాత్ర పోషించగా.. “నువ్వే కావాలి, ప్రేమించు” వంటి పలు చిత్రాల్లో హీరోగా నటించిన సాయి కిరణ్ విలన్ గా నటించారు. రామ్ కార్తిక్, సప్తగిరి, రాజీవ్ కనకాల, పృథ్వి (30 ఇయర్స్), తనికెళ్ళ భరణి, సంధ్యా జనక్, సూర్య, లలిత, ప్రియ, మీనాకుమారి, జబర్దస్త్ అప్పారావు, జబర్దస్త్ దుర్గారావు తదితరులు ఇతర పాత్రలు పోషించిన ఈ చిత్రానికి పి.ఆర్.ఓ: ధీరజ్-అప్పాజీ, పబ్లిసిటీ డిజైనర్: విక్రమ్ రమేష్, డాన్స్: అనీష్, పాటలు: సాగర్, సంగీతం: సుభాష్ ఆనంద్, బ్యాక్ గ్రౌండ్ స్కోర్: ఎస్.చిన్నా, పోరాటాలు: రామ్ కిషన్, కళ: జె.కె.మూర్తి, ఛాయాగ్రహణం: క్రాంతికుమార్.కె, కూర్పు: ఉపేంద్ర, కో-డైరెక్టర్: వి.వి.రమణ, నిర్మాత: ఆర్.రాచయ్య, కథ-స్క్రీన్ ప్లే-దర్శకత్వం: విశ్

Related Posts