‘ఊరిపేరు భైరవకోన’ కి సీక్వెల్‌ కాదు ప్రీక్వెల్ ఉండొచ్చు : నిర్మాత రాజేష్‌ దండ

సందీప్ కిషన్, నేను, విఐ ఆనంద్ మంచి ఫ్రెండ్స్. డిస్ట్రిబ్యుటర్ గా 12 ఏళ్ల పాటు చేశాను. నిర్మాతగా చేయాలనుకున్నపుడు హాస్య మూవీస్ బ్యానర్‌ లో మొదట అనుకున్న సినిమానే ‘ఊరు పేరు భైరవకోన’ అన్నారు నిర్మాత రాజేష్‌ దండ. సందీప్‌ కిషన్‌, వర్ష బొల్లమ్మ, కావ్య థాపర్‌లు మెయిన్‌ లీడ్ లో విఐ ఆనంద్‌ డైరెక్షన్‌లో రాబోతున్న ఫాంటసీ అడ్వంచరస్‌ మూవీ ‘ఊరిపేరు భైరవకోన’. ఫిబ్రవరి 16 న ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ కాబోతున్నసందర్బంగా రాజేష్‌ దండ చిత్ర విశేషాలను విలేకరులతో పంచుకున్నారు.


-‘ఊరు పేరు భైరవకోన’ ఫాంటసీ థ్రిల్లర్. మన ఊర్లో ఏం జరుగుతుందో మనికి తెలుసు. కానీ ‘భైరవకోన’ అనే ఊరులో కొత్తగా వెరైటీగా ఎవరూ ఊహించిన సంఘటనలు జరుగుతుంటాయి. అది నాకు చాలా ఆసక్తిని కలిగించింది.


ఈ చిత్రంలో సీజీ వర్క్‌ మెయిన్‌ ఎట్రాక్షన్‌ అన్నారు. గరుడపురాణంలో మిస్ అయిన పేజీలకి ఈ కథకి వున్న లింక్ ఏమిటనేది కూడా చాలా ఆసక్తిగా వుంటుంది. సినిమాలో47 నిమిషాల అద్భతమైన సిజీ వర్క్ వుంది. విజువల్స్ చాలా గ్రాండ్ గా వుంటాయి. ప్రేక్షకులకు చాలా గొప్ప థియేట్రికల్ ఎక్స్ పీరియన్స్ ఇస్తుందన్నారు నిర్మాత రాజేష్‌ దండ.


మొదట నేను విన్నాక కథ నచ్చితేనే అనిల్‌ గారు వింటారన్నారు. అనిల్‌ గారు సినిమాకు సంబంధించి అనేక విలువైన సూచనలు ఇస్తుంటారన్నారు.ఈ కథకు సీక్వెల్, ప్రీక్వెల్ చేయొచ్చు..కానీ సీక్వెల్‌ ఉంటుందనే లీడ్ ఏం ఇవ్వడం లేదన్నారు.శేఖర్ చంద్ర తన ప్రతి సినిమాలో చాలా మంచి పాటలు ఇస్తారు. ఇందులో నిజమేనా చెబుతున్న పాట చాలా వైరల్ అయ్యింది. నిజానికి ఈ ట్యూన్ శేఖర్ దగ్గర ఐదేళ్ళుగా వుంది. చాలా మందికి వినిపించాడు. ఫైనల్ సందీప్ కిషన్ విని దర్శకుడికి వినమన్నారు. అలా ఆ పాట మాకు రావడం చాలా లక్కీ. బ్యాక్‌గ్రౌండ్ స్కోర్‌ సూపర్బ్ గా వచ్చిందన్నారు ప్రొడ్యూసర్‌ రాజేష్‌.


అప్‌కమింగ్ ప్రాజెక్ట్స్ గురించి చెప్తూ.. అల్లరి నరేష్ గారితో బచ్చల మల్లి షూటింగ్ జరుగుతోంది. అలాగే కిరణ్ అబ్బవరంతో ఓ సినిమా చేయబోతున్నామన్నారు నిర్మాత రాజేష్‌ దండ.

Related Posts