ఈ హీరోయిన్ కేవలం స్కిన్ షో కేనా

కొందరు హీరోయిన్లుంటారు. టాలెంట్ ఉంటుంది. కానీ అవకాశాలు రావు. వచ్చినా అందులో నిరూపించుకోవడానికి ఏమీ ఉండదు. కేవలం స్కిన్ షో చేయడానికి తప్ప. చాలాకాలంగా తెలుగులో పాగా వేయాలని ప్రయత్నించి ఆఖరికి చిన్న చిన్న పాత్రలకూ, సెకండ్ హీరోయిన్ కూ తక్కువే అనిపించే రోల్స్ కూ ఓకే చెబుతూ కెరీర్ బండిని లాగిస్తోన్న కేథరీన్ థ్రెస్సా పరిస్థితి కూడా ఇదే. అమ్మడు చాలా సినిమాల్లో కనిపిస్తుంది. కానీ ఏ సినిమాలోనూ తన పాత్రకు ఓ బలం ఉండదు. ఈ రోల్ ద్వారా మరో సినిమాలో హీరోయిన్ గా పెద్ద ఛాన్స్ వస్తుందనే హోప్ ఉండదు. ఎప్పుడో కృష్ణవంశీ పైసా సినిమా నుంచి తను తెలుగు సినిమా హీరోయిన్ అనిపించుకునే ప్రయత్నం చేస్తూ…నే ఉంది. లాస్ట్ వీక్ వచ్చిన బింబిసారలో బలమైన పాత్రే అనిపించింది. కానీ కాసేపట్లోనే తేలిపోయింది. ఒక్క పాటలో అందాలొలకబోసేందుకు మాత్రమే ఉపయోగించుకున్నారు.

ఇక లేటెస్ట్ గా వచ్చిన మాచర్ల నియోజకవర్గంలో ఆమెను పొట్టి నిక్కర్లలో మాత్రమే చూపించాలని దర్శకుడు గట్టిగా నిర్ణయించుకున్నట్టున్నాడు. ఆ మేరకు ఆవిడ కిచెన్ లో ఉన్నా.. పేరెంట్స్ తో ఉన్నా.. తొడలు మొత్తం కనిపించేలాంటి కాస్ట్యూమ్స్ తోనే ఉంటుంది. చివరికి ఇందులోనూ హీరోయిన్ గా హ్యాండ్ ఇచ్చిన పాత్రే. నిజానికి తనలో మంచి టాలెంట్ ఉందని చెప్పేందుకు పైసా, ఇద్దరమ్మాయిలతో, ఒకరాజు ఒకరాణి, సరైనోడు వంటి సినిమాలు చాలు. అయినా హీరోయిన్ గా ఎవరూ పట్టించుకోవడం లేదంటే మిస్టేక్ ఈవిడదా లేక ఇంకేదైనా ఉందా అనేది తెలియాలి. ఏదేమైనా కేథరీన్ అంటే కేథరీన్ ఉంటే.. ఆ సినిమాలో తనది కరివేపాక పాత్రే అని ఆడియన్స్ ముందుగానే ఫిక్స్ అయిపోతారేమో..

Related Posts