అప్పుడు వెంక‌టేష్ లా ఇప్పుడు నాగ్ కెరీర్

హీరోల‌న్నాక కెరీర్ లో అప్ అండ్ డౌన్స్ కామ‌న్. కానీ అన్నీ డౌన్స్ మాత్ర‌మే ఉంటే క‌ష్టంగా ఉంటుంది. ప్ర‌స్తుతం అక్కినేని నాగార్జ‌న ఆ క‌ష్టాల్లోనే ఉన్నాడు. ఒక‌టి రెండు కాదు.. ఏకంగా అర‌డ‌జనుకు పైగా ఫ్లాపులు వ‌రుస‌గా ఉన్నాయి. మ‌ధ్య‌లో బంగార్రాజు సినిమా అబౌ యావ‌రేజ్ అనిపించుకుంది. అఫ్ కోర్స్ మేజ‌ర్ క్రెడిట్ నాగ చైత‌న్య‌కే వెళ్లింది. ఇక హిట్ కోసం దేవ‌దాస్ లాంటి మ‌ల్టీస్టార‌ర్ తో పాటు ఆఫీస‌ర్ లాంటి అన‌వ‌స‌ర సినిమాలూ చేశాడు.

మ‌న్మ‌థుడు 2 మ‌రీ డిజాస్ట‌ర్ అనిపించుకుంది. ఇక రీసెంట్ టైమ్స్ లో పోలీస్ గా వైల్డ్ డాగ్ మారినా ఫ‌లితం రాలేదు. లేటెస్ట్ గా వ‌చ్చిన ఘోస్ట్ సైతం టైమ్ వేస్ట్ మూవీగా తేల్చారు ఆడియ‌న్స్. కాస్త స్టైలిష్ గానే ఉన్నా.. ప‌స లేని క‌థ‌, క‌థ‌నాల‌తో సినిమాకు ఫ్లాప్ టాక్ వ‌చ్చేసింది. పైగా ఈ వ‌య‌సులో నాగ్ చేయ‌ద‌గిన యాక్ష‌న్ సీన్స్ కాక‌పోవ‌డంతో ఎక్కువ శాతం ఫైట్స్ పై డిపెండ్ అయిపోవ‌డంతో మ‌రీ మైన‌స్ అయింది.


నిజానికి ఇలాంటి ఫేజ్ ను గ‌తంలో హీరో వెంక‌టేష్ కూడా ఫేస్ చేశాడు. వ‌రుస‌గా వ‌చ్చిన ఫ్లాపులతో ఓ ద‌శ‌లో ఇక క్యారెక్ట‌ర్ ఆర్టిస్ట్ గా మారాల్సిందే అనే క‌మెంట్స్ కూడా వ‌చ్చాయి. బ‌ట్ దృశ్యం మూవీతో సీన్ మారింది. తిరిగి మ‌ళ్లీ వ‌రుస విజ‌యాలు సాధిస్తున్నాడు. దృశ్యం.. ఇమేజ్ కు భిన్న‌మైన సినిమా. అందుకే విజ‌యం సాధించింది. ఇప్పుడు నాగ్ చేయాల్సింది కూడా అదే. ఇమేజ్ ను దాటాలి.

అంటే సింపుల్.. త‌న ఏజ్ ను గుర్తించాలి. అందుకు త‌గ్గ క‌థ‌లే ఎంచుకోవాలి. ఇంకా మ‌న్మ‌థుడులా ఫీల్ అవుతూ హీరోయిన్ల‌తో రొమాన్స్ లు చేస్తూ.. స‌హ‌క‌రించ‌ని శ‌రీరంతో యాక్ష‌న్ సీన్స్ చేస్తే చూడ్డానికి జ‌నం సిద్ధంగా లేరు.మొత్తంగా 2016 నుంచి నాగ్ కు ఒక్క‌టి కూడా పెద్ద విజ‌యం ప‌డ‌లేదు. మ‌రి ఇలాగే ఉంటే ప్రేక్ష‌కులు ఇంకా ఎక్కువ సినిమాల వ‌ర‌కూ భ‌రించ‌లేరు.

Related Posts