సూపర్‌ ఉమెన్ ‘ఇంద్రాణి’ ట్రైలర్‌ లాంచ్‌

టైమ్‌ ట్రావెల్‌ కాన్సెప్ట్‌తో వచ్చే సినిమాలకు ఖచ్చితంగా ఆదరణ ఉంటుంది. థ్రిల్లింగ్ టైమ్‌ ట్రావెల్‌ సబ్జెక్ట్‌తో పాన్ ఇండియా స్థాయిలో రాబోతున్న మూవీ ఇంద్రాణి. హై టెక్నికల్‌ వేల్యూస్‌తో రాబోతున్న ఈ మూవీని స్టెఫన్ పల్లం డెబ్యూ డైరెక్షన్‌లో వెరోనికా ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై స్టాన్లీ సుమన్ బాబు నిర్మాణ సారథ్యంలో సుధీర్ వేల్పుల నిర్మిస్తున్నారు. సాయికార్తీక్‌ సంగీతం అందిస్తున్నారు. యానియా భరధ్వాజ్‌, కబీర్ దుహాన్‌ సింగ్‌ లీడ్ రోల్స్ ప్లే చేస్తున్నారు. ఈ మూవీ టీజర్‌ కు మంచి రెస్పాన్స్ వచ్చింది. సూపర్ ఉమెన్ కాన్సెప్ట్‌తో వస్తున్న ఇంద్రాణి మూవీ ట్రైలర్ ను హైదరాబాద్‌ పార్క్‌ హయత్‌ హోటల్‌ లో రిలీజ్‌ చేసారు. నిర్మాత అనిల్‌ సుంకర, మెలోడీ బ్రహ్మ మణిశర్మ ముఖ్య అతిధులుగా హాజరయి చిత్ర విజయాన్ని కాంక్షించారు.


సాయికార్తీక్‌ అందించిన సంగీతం ఇంద్రాణి చిత్రానికి ప్రధాన ఆకర్షణ అన్నారు మెలోడీ బ్రహ్మ మణిశర్మ.
సినీ నిర్మాణమే చాలా కష్టాలతో కూడుకున్నదైతే.. అమెరికాలో ఉంటూ ఇక్కడ సినిమా నిర్మించిన కేకే గారిని ప్రత్యేకంగా అభినందించారు నిర్మాత అనిల్ సుంకర. కేకే తన మిత్రుడని చెప్పుకునేందుకు గర్వపడుతున్నానన్నారు. సినిమా క్వాలిటీని, కంటెంట్‌ను మెచ్చుకున్నారు అనిల్‌ సుంకర.
చిత్ర యూనిట్‌.. అతిధులు ఇంద్రాణి ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌లో పాల్గొని చిత్ర విజయం పట్ల నమ్మకాన్ని వ్యక్తం చేసారు.

Related Posts