సర్కారు వారి ‘పాట’లో సత్తా లేదే

ఒక సినిమాకు టైటిల్ ఎంత పవర్ ఫుల్ గా ఉంటే ఆడియన్స్ లోకి అంత స్పీడ్ గా వెళుతుంది. సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా వస్తోన్న సర్కారువారిపాట సినిమా టైటిల్ అనౌన్స్ అయినప్పుడు చాలామంది చాలా బావుంది అనుకున్నారు. చాలా రోజుల తర్వాత మాస్ మూవీతో వస్తున్నాడు మహేష్ బాబు అన్నప్పుడు అంతా పోకిరి రేంజ్ మూవీ ఎక్స్ పెక్ట్ చేస్తున్నారు. ఆ మధ్య వచ్చిన టీజర్ కూడా అదే చెప్పింది. అలాంటి సినిమాలో టైటిల్ తో పాటు టైటిల్ సాంగ్ కూడా అద్దిరిపోవాలి అనుకుంటారు. కానీ లేటెస్ట్ గా విడుదలైన ఈ పాట చూస్తే అలా అనిపించడం లేదు.

మహేష్ బాబు సరసన కీర్తి సురేష్ హీరోయిన్ గా నటిస్తోన్న సర్కారువారిపాట మే 12న విడుదల కాబోతోంది. ఇప్పటికే సినిమాపై భారీ అంచనాలున్నాయి. పరశురామ్ డైరెక్ట్ చేస్తోన్న ఈ చిత్రానికి తమన్ సంగీతం అందిస్తున్నాడు. ఈ మధ్య వరుసగా బ్లాక్ బస్టర్ ఆల్బమ్స్, ఆర్ఆర్స్ ఇస్తోన్న తమన్ ఎంట్రీతో మ్యూజిక్ అదిరిపోతుంది అనుకున్నారు. అనుకున్నట్టుగానే ఆ మధ్య వచ్చిన కళావతి సాంగ్ అద్దిరిపోయింది. బట్ లేటెస్ట్ గా వచ్చిన సర్కారువారి పాట టైటిల్ సాంగ్ మాత్రం ఆ రేంజ్ లో కనిపించడం లేదు.

లిరిక్స్ ను మ్యూజిక్ డామినేట్ చేస్తోంది. కొన్ని పదాలు అర్థం కూడా కావడం లేదు. నాలుగైదు సార్లు వింటే తప్ప తెలియడం లేదు ఆ పదాలేంటనేది. ఇక సర్కారువారి పాట అల్లూరి వారి బేటా అనడం కేవలం రైమింగ్ గా పనికొచ్చింది తప్ప.. నిజంగా అల్లూరివారి బేటా అనడం మాత్రం అస్సలు బాలేదు. ఎంత సూపర్ స్టార్ కృష్ణ అల్లూరిసీతారామరాజు సినిమా చేసినా.. ఆ పదం కాస్త ఇబ్బందికరంగానే ఉంది.అనంత్ శ్రీరామ్ రాసిన ఈ పాటను హారిక నారాయణ్ ఆలపించారు. తన గాత్రంలో ఎలివేషన్ కనిపిస్తున్నా.. అందుకు తగ్గ పవర్ పదాల్లో లేదు. ఉన్నా.. మ్యూజిక్ డామినేషన్ లో వెనకబడిపోయింది అనే చెప్పాలి.

Related Posts