కత్రినా కైఫ్‌ భర్తతో సమంత రొమాన్స్ ..

కత్రినా కైఫ్‌కెరీర్ లో సెకండ్ ఇన్నింగ్స్ ను పక్కాగా ప్లాన్ చేసుకుంటోంది సమంత. ఇప్పటి వరకూ తనే ప్రధాన పాత్రల్లో ఉన్న సినిమాలకు సైన్ చేసి ఉన్న సమంత.. మళ్లీ పాత రూట్ లోకి ఎంటర్ కాబోతోంది. అంటే హీరోయిన్ ఓరియంటెడ్ మాత్రమే కాకుండా రెగ్యులర్ రోల్స్ లోనూ కనిపించేందుకు ఓకే చెబుతోందట. నిజానికి ఈ తరహా సినిమాగా ఇప్పటికే ఖుషీ చేస్తోంది. కాకపోతే ఇది డిఫరెంట్ స్టోరీ. బట్ తనదైన శైలిలో రెచ్చిపోతూనే రేంజ్ కూడా మార్చుకోవడానికి బాలీవుడ్ పై ఎక్కువ ఫోకస్ చేస్తోంది. రీసెంట్ గా ఆయుష్మాన్ ఖురానాతో మూవీకి ఓకే చెప్పిన శామ్ లేటెస్ట్ గా మరో బాలీవుడ్ స్టార్ తో రొమాన్స్ కు రెడీ అవుతోందట. మరి ఎవరా హీరో.. ఏమా కథ..?సమంత.. లైఫ్ లో వచ్చిన సమస్యలను ఫేస్ చేస్తూనే కెరీర్ ను మళ్లీ రీ కన్ స్ట్రక్ట్ చేసుకుంటోంది. ఈ విషయంలో తను సూపర్ సక్సెస్ అవుతుంది అని కూడా చెప్పొచ్చు. తను నటించిన యశోద విడుదలకు సిద్ధంగా ఉంది.

దీంతో పాటు మరో రెండు బై లింగ్వుల్, విజయ్‌ దేవరకొండతో ఖుషీ మూవీ చేస్తోంది. మరోవైపు హిందీలో బ్యాక్ టు బ్యాక్ బ్లాక్ బస్టర్స్ కొట్టిన ఏకైక హీరో ఆయుష్మాన్ ఖురానా సరసన ఓ మూవీకి సైన్ చేసింది. ఇటు ఓ వెబ్ సిరీస్ కూ రెడీ అవుతోంది. అలా పర్ఫెక్ట్ ప్లానింగ్ తో దూసుకుపోతోన్న సమంత మరోవైపు తనపై వస్తోన్న విమర్శలకు కూడా దీటుగానే సమాధానం చెబుతోంది. ఎన్ని చేసినా సెకండ్ ఇన్నింగ్స్ లో నయనతారలా సత్తా చాటడం అంత సులువు కాదు. అందుకే రెగ్యులర్ హీరోయిన్ రోల్స్ కూ ఓకే చెబుతోంది.రీసెంట్ గా కత్రినా కైఫ్‌ ను లవ్ మ్యారేజ్ చేసుకున్న విక్కీ కౌశల్ బాలీవుడ్ లో తనదైన రూట్ క్రియేట్ చేసుకున్నాడు. ఉరి సినిమాతో కంట్రీ మొత్తం ఫేమ్ అయిన విక్కీ ఇప్పుడు బాలీవుడ్ లో స్టార్డమ్ కోసం ప్రయత్నాలు చేస్తున్నాడు. అతని లేటెస్ట్ మూవీలోనే సమంత హీరోయిన్ గా నటించేందుకు ఓకే చెప్పిందనే న్యూస్ వినిపిస్తున్నాయి. విక్కీ కౌశల్ మరీ పెద్ద స్టార్ కాకపోయినా అతని స్టోరీ సెలెక్షన్ బావుంటుందనే టాక్ ఉంది. ఆ టాక్ వల్లే శామ్ ఈ ప్రాజెక్ట్ పై ఇంట్రెస్టింగ్ గా ఉందంటున్నారు. ఇదే నిజమైతే ఖచ్చితంగా తను ఊహించినట్టుగానే రేంజ్ మారుతుంది. బాలీవుడ్ లో మెల్లగా పాగా వేసే అవకాశమూ వస్తుంది. కాకపోతే ఈ మూవీస్ సూపర్ హిట్ కావాల్సి ఉంటుంది.

Related Posts