ad

యంగ్ టైగర్  పై ఫ్యాన్స్ అసహనంగా ఉన్నారా..? ఆయన ప్లానింగ్ చూసి ఫీలవుతున్నారా..? అసలు కొరటాలతో సినిమా విషయంలో వాళ్లంతా డిజప్పాయింట్ అవుతున్నారా..? అంటే అవుననే మాటలే ఎక్కువగా వినిపిస్తున్నాయి. మామూలుగా ఫ్యాన్స్ కోసం ఏమైనా చేసే యంగ్ టైగర్ మరి ఈ సారి ఎందుకు ఇలా చేస్తున్నాడు అంటే ఆన్సర్ లేదు. అయినా ఇన్ని అనుమానాలు రావడానికీ ఓ కారణం ఉండాలి కదా..? అంటే ఉన్నాయి. ఫ్యాన్స్ ఫీలవడానికీ రీజన్స్ ఉన్నాయి. మరి అవేంటో తెలుసా..?విపరీతమైన పోటీ ఉన్న పరిశ్రమల్లో సినిమా ఇండస్ట్రీ ఒకటి. ఎంత టాలెంట్ ఉన్నా.. ఫ్యాన్ బేస్ ఉన్నా.. ప్లానింగ్ కరెక్ట్ గా లేకపోతే పోటీలో వెనకబడిపోవడం ఖాయం. ఈ విషయంలో ఎన్టీఆర్ కాస్త ఇబ్బంది పడుతున్నాడు అనే మాటలు రెగ్యులర్ గా వినిపిస్తూనే ఉంటాయి. ఆర్ఆర్ఆర్ వంటి బిగ్గెస్ట్ ప్యాన్ ఇండియన్ మూవీ తర్వాత ఆ ఇమేజ్ ను కంటిన్యూ చేసేలా ప్లానింగ్ లేదనే కమెంట్స్ వస్తున్నాయి. అందుకు కారణం కొరటాల శివతో సినిమా చేస్తుండటమే అని కొందరి అభిప్రాయం. ఆ విషయం ఎన్టీఆర్ కు తెలియదా అనుకోవచ్చు. అయినా సరే.. ఆచార్యతో ఆల్ టైమ్ డిజాస్టర్ ఇచ్చిన కొరటాలతో ఇప్పుడే మూవీ చేయకుండా ఉండాల్సిం అంటారు. అవన్నీ ఎలా ఉన్నా.. ఆల్రెడీ అనౌన్స్ అయిన ఈ ప్రాజెక్ట్ కు సంబంధించి ఎన్టీఆర్ ఫ్యాన్స్ లో ఓ అసంతృప్తి కనిపిస్తోందట. అందుకు కారణం లేకపోలేదు. 2018లో వచ్చిన అరవింద సమేత తర్వాత ఆర్ఆర్ఆర్ వరకూ రావడానికి చాలా టైమ్ పట్టింది ఎన్టీఆర్ కు. ఆ టైమ్ లో ఇతర స్టార్ హీరోలు బాగా దూసుకుపోయారు.

బట్ రాజమౌళి కోసం చాలాకాలం వెయిట్ చేసిన ఎన్టీఆర్ .. ఇప్పుడు కూడా అదే ధోరణి చూపిస్తున్నాడు. ఆర్ఆర్ఆర్ తర్వాత వెంటనే సినిమా చేస్తాడు అనుకుంటే అది అనౌన్స్ మెంట్ దగ్గరే ఆగింది తప్ప.. సెట్స్ పైకి వెళ్లడం లేదు. పోనీ ఈ మూవీ కోసం కొత్త మేకోవర్ ట్రై చేస్తున్నాడా అంటే అదీ లేదంటున్నారు. అయినా ఈ గ్యాప్ కు కారణమేంటీ అంటే కథ అనుకున్నంత గొప్పగా ఇంకా కుదరలేదు అనే టాక్ వస్తోంది. అదే అభిమానుల అసహనానికి కారణం. అటు కొరటాల కూడా ఒక్క ఫ్లాప్ కే డీలా పడ్డాడు అనేది వారి వెర్షన్.కొరటాల తర్వాత ప్రశాంత్ నీల్ తో సినిమాకు కమిట్ అయి ఉన్నాడు ఎన్టీఆర్. ఆ మూవీ మేటర్ ఎలా ఉన్నా.. ముందు కొరటాల ప్రాజెక్ట్ అయినా సెట్స్ పైకి వెళితే తమ అభిమాన హీరోను త్వరగా వెండితెరపై చూసుకోవచ్చు అనేది ఫ్యాన్స్ వెర్షన్. మరి ఫ్యాన్స్ కోసం తొందరపడితే వారు ఫీలవుతున్నట్టుగానే రిజల్ట్ తేడా కొడుతుంది కదా. అందుకే ఇంత గ్యాప్ అనేది ఈ ప్రొడక్షన్ వైపు నుంచి వస్తోన్న వాదన. ఏదేమైనా ఎన్టీఆర్ ఇంత ఆలస్యంగా సినిమా చేయడం పట్ల.. ఇతర హీరోల అభిమానుల వద్ద వారు కాస్త ఇబ్బంది పడుతున్నారనేది నిజం. సో వీలైనంత త్వరగా ఈ ప్రాజెక్ట్స్ సెట్స్ పైకి వెళుతుందేమో చూడాలి.

, , , , ,