సమంత ప్యాన్ ఇండియా థ్రిల్లర్ ‘యశోద’

ఓ బేబీ, యూటర్న్, ఫ్యామిలీ మేన్ 2 లాంటి చిత్రాలతో నటిగా పర్మార్మెన్స్ చూపించింది సమంత. విడాకులై మళ్లీ బ్యాచ్ లర్ లైఫ్ లోకి వచ్చిన ఈ బ్యూటీ…కెరీర్ పై మరింత ఫోకస్ చేసినట్లు కనిపిస్తోంది. శాకుంతలం అనే పౌరాణిక చిత్రంలో ప్రస్తుతం నటిస్తున్న సమంత…తన కొత్త ప్యాన్ ఇండియా మూవీ యశోదని అనౌన్స్ చేసింది.

ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ సోమవారం పూజా కార్యక్రమాలతో ప్రారంభమైంది. ఈ సినిమాకు ఇద్దరు యువకులు హరి – హరీష్ దర్శకత్వం వహిస్తున్నారు. కాన్సెప్ట్‌ బేస్డ్ గా రూపొందుతున్న యశోద చిత్రాన్ని తెలుగు, తమిళం, కన్నడ, మలయాళంతో పాటు హిందీ భాషలో తెరకెక్కిస్తున్నారు. థ్రిల్లర్ జానర్ లో తెరకెక్కనున్న యశోద సినిమా సమంతను కొత్త యాంగిల్ లో ప్రెజెంట్ చేయబోతోంది. వచ్చే సమ్మర్ కు ఈ సినిమాను రిలీజ్ చేయాలని ప్లాన్ చేస్తున్నారు.

Related Posts