కొన్నైనా మంచివే చేయాలి – హీరో శివ కందుకూరి

నిర్మాత రాజ్ కందుకూరి తనయుడు శివ నటించిన కొత్త సినిమా గమనం. ఈ సినిమా డిసెంబర్ 10న ప్రేక్షకుల ముందుకొస్తోంది. ఈ సందర్భంగా శివ కందుకూరి గమనం సినిమాలో పనిచేసిన అనుభవాలపై మాట్లాడారు. గమనం సినిమా తను మర్చిపోలేని ఎక్సీపిరియన్స్ ఇచ్చిందన్న శివ కందుకూరి. తన కెరీర్ లో ఇళయరాజాతో పనిచేస్తానని అస్సలు ఊహించలేదని అన్నారు. ఆలస్యమైనా సెలెక్టెడ్ ప్రాజెక్ట్ లు చేస్తానని చెప్పారు. నాని నిర్మాణంలో మీట్ క్యూట్ అనే వెబ్ సిరీస్ చేస్తున్నాననీ. మరో రెండు సినిమాలకు సైన్ చేశాననీ తెలిపారు.

శివ కందుకూరి మాట్లాడుతూ…పెద్ద పెద్ద హిట్‌లు అయిన సినిమాలు కూడా కొన్ని రోజులే గుర్తుంటాయి. కానీ సినిమాలోని ఎమోషన్ మాత్రం కనెక్ట్ అయితే అవి ఎక్కువగా కాలం గుర్తుండిపోతాయి.అలా ఎమోషన్ నాకు కనెక్ట్ కాలేకపోతే సినిమాలు చేయలేను.. ఇన్ని సినిమాలు చేయాలని కాదు.. వచ్చే పదేళ్లలో ఐదు సినిమాలు చేసినా కూడా మంచివే చేయాలని అనుకుంటాను. ఈ సినిమాను చూసిన ప్రతీ ఒక్కరూ మంచి ఫీలింగ్‌తోనే బయటకు వస్తారు. ప్రియాంక ఎంత బాగా నటించింది.. శివ ఎంత బాగా చేశాడు.. శ్రియ ఎంత అద్భుతంగా నటించిందని అనుకుంటారు. మంచి సినిమా చూశామన్న ఫీలింగ్ మాత్రం వస్తుంది. అన్నారు

Related Posts