బిగ్ బాస్ కు గుడ్ బై చెప్పిన సల్మాన్ ..?

బిగ్ బాస్.. ఒకప్పుడు బాగా అభివృద్ధి చెందిన దేశాల్లో మాత్రమే కనిపించిన రియాలిటీ షో. ఈ షో అక్కడి జనానికి అప్పుడు కొత్తగా కనిపించింది. దీంతో చాలా వరకూ అడిక్ట్ అయ్యారు. ఈ అడిక్షన్ ను తర్వాత ఇతర దేశాలకూ విస్తరించారు. ప్రస్తుతం బిగ్ బాస్ తరహా రియాలిటీ షో లేని కంట్రీ లేదు అంటే అతిశయోక్తి కాదు. అలాగే ఇండియాకూ వచ్చింది. నిజానికి ఈ తరహా షో ఇండియా వంటి సంప్రదాయ దేశాలకు అంతగా సరిపోదు అనుకున్నారు. బట్.. ఆ మాటను అబద్ధం అని తేల్చాడు సల్మాన్ ఖాన్. ఆయన హోస్ట్ గా భారత్ లో మొదలైన బిగ్ బాస్ తర్వాత ప్రాంతీయ భాషల వరకూ వచ్చి సూపర్ సక్సెస్ అయిందంటే కారణం సల్మాన్ ఖానే అనేది కాదనలేని వాస్తవం. ఆ రేంజ్ లో ఈ రియాలిటీ షోను రక్తి కట్టించాడు సల్మాన్ ఖాన్. అఫ్ కోర్స్ అదే రేంజ్ లో తన పారితోషికం కూడా ఉండేది.
ప్రస్తుతం తెలుగులో కూడా ఐదు సీజన్స్ ను పూర్తి చేసుకుంది బిగ్ బాస్. తెలుగుతో పాటు ఇతర భాషల్లోనూ సక్సెస ఫుల్ గా రన్ అవుతోందంటే కారణం.. ఆయా భాషల్లో చేస్తోన్న హోస్ట్స్ అంతా ఎంత కాదనుకున్నా అప్పుడప్పుడూ సల్మాన్ ను అనుకరిస్తూనే ఉంటారు. అలాంటి సల్మాన్ ఖాన్ ఇన్నేళ్ల తర్వాత బిగ్ బాస్ కు గుడ్ బై చెబుతున్నాడంటూ వార్తలు వస్తున్నాయి. ఇంకా అఫీషియల్ గా కన్ఫార్మ్ కాలేదు. అయినా అప్పుడే సల్మాన్ లేని బిగ్ బాస్ ను ఊహించలేమంటూ అభిమానులు సోషల్ మీడియాలో పోస్ట్ లు పెడుతున్నారు. మరి సల్మాన్ వెళ్లిపోతే ఆ రేంజ్ లో బిగ్ బాస్ ను నడిపించే సత్తా ఉన్న బాలీవుడ్ స్టార్స్ ఎవరూ మనమూ ఓ గెస్ స్టార్ట్ చేద్దాం.

Related Posts