ఆ సూపర్ హిట్ మూవీ రీమేక్ లో హృతిక్, సైఫ్

ఒకప్పుడు బాలీవుడ్ వారికి సౌత్ సినిమాలంటే చిన్న చూపు ఉండేది. అసలు మనవి సినిమాలే కాదు అనేంత యారగెన్సీ చూపించేవారు. మరీ పాత తరం వారు కాదు కానీ.. తర్వాత వచ్చిన ఖాన్ తరం అంతా అలాగే భావించింది. కానీ దశాబ్ధం క్రితం నుంచి ట్రెండ్ మారింది. బాలీవుడ్ లో అన్నీ రొడ్డకొట్టుడు సినిమాలే వస్తున్నాయి. దీంతో అక్కడి ప్రేక్షకులు సౌత్ సినిమాల డబ్బింగ్ వెర్షన్స్ కు అలవాటయ్యారు. అప్పుడు కానీ సినిమా అనేది ఎంత పెద్ద సెలబ్రేషన్ అనేది వారికి అర్థం కాలేదు. మరోవైపు బాలీవుడ్ లో ఫ్లాపులు మొదలయ్యాయి. దీంతో అనివార్యంగా వాళ్లు సౌత్ సినిమాల రీమేక్స్ పై పడ్డారు. ఇక ఇప్పుడు బాలీవుడ్ కు అంత సీన్ లేదు. ఇండియన్ సినిమా అంటే సౌత్ ఇండస్ట్రీయే అన్నంతగా ఈ మధ్యకాలంలోనే మొత్తం మారిపోయింది. అందుకు కారణం బాహుబలి, కెజీఎఫ్.
ఇక కొన్నాళ్లుగా బాలీవుడ్ స్టార్స్ సౌత్ సినిమాలను రీమేక్ చేస్తూ విజయాలు అందుకుంటున్నారు. ఆ లిస్ట్ లోకి మొదటిసారిగా హృతిక్ రోషన్, సైఫ్ అలీఖాన్ చేరారు. కొన్నాళ్ల క్రితం తమిళ్ లో సూపర్ హిట్ అయిన సినిమా విక్రమ్ వేద. విజయ్ సేతుపతి, మాధవన్ నటించిన సినిమా ఇది. ఓ పోలీస్, ఓ గ్యాంగ్ స్టర్ కు మధ్య జరిగే రేసీ