ఆర్ఆర్ఆర్ దెబ్బకి పుష్ప అవుట్ ..?

ప్రమోషన్ అనేది ఓ స్ట్రాటజీ.. ఆ స్ట్రాటజీలో పిహెచ్.డి చేసిన వాడు రాజమౌళి. అతన్లా ప్రమోషన్స్ చేయడం ఇండియాలో మరే దర్శకుడికీ రాదు అని ఖచ్చితంగా చెప్పొచ్చు. అయినా రీసెంట్ గా ఓ రాంగ్ స్టెప్ వేయబోయాడు. అనుకోని అవకాశం కలిసి రావడంతో కరెక్ట్ చేసుకోవడమే కాదు.. తను పోటీ అని భావించిన సినిమాను సోదిలో లేకుండా చేయగలిగాడు. యస్.. ఇదంతా పుష్ప చిత్రం గురించే. మామూలుగా రాజమౌళి ఆర్ఆర్ఆర్ ట్రైలర్ ను ఈ నెల 3న విడుదల చేయాలనుకున్నాడు. పుష్ప 6న విడుదల చేస్తున్నామని చెప్పారు. ఒకవేళ ఆర్ఆర్ఆర్ ట్రైలర్ ముందు వచ్చి తర్వాత పుష్ప వచ్చి ఉంటే రాజమౌళి మూవీ వ్యూస్ తగ్గి ఉండేవి. అఫ్ కోర్స్ ట్రైలర్ లో దమ్ము ఉంది కాబట్టి.. తర్వాత పుంజుకుంటుంది. బట్.. పుష్ప కోసమైనా చూస్తారు కదా ఆడియన్సెస్.
ఇక ఈ విషయంలో సీతారామశాస్త్రి గారి మరణంతో ఆర్ఆర్ఆర్ ట్రైలర్ ను పోస్ట్ పోన్ చేసి ఇవాళ విడుదల చేశారు. ఆల్రెడీ వచ్చిన పుష్ప ట్రైలర్ ఫ్యాన్స్ కు కూడా కిక్ ఇవ్వలేదని అందరికీ తెలుసు. అసలే యావరేజ్ గా ఉణ్న ఆ ట్రైలర్ పై ఇప్పుడు ఆర్ఆర్ఆర్ ట్రైలర్ తుఫాన్ లా పడిందంటున్నారు.. మెగా నందమూరి ఫ్యాన్స్. అలాగని ఇదేమీ కాంట్రవర్శీ కాదు. కానీ ప్రతి దానికీ ప్రమోషన్ చేయాలనే ఉత్సాహంతో పుష్ప నుంచి ఏ చిన్న అప్డేట్ వచ్చినా.. ఇప్పటి వరకూ వచ్చిన సినిమాల కంటే మేమే తోపులం అనే రేంజ్ లో ఆ చిత్ర అభిమానులు సోషల్ మీడియాలో పోస్ట్ లు పెడుతున్నారు. ఇక సునామీ లాంటి ఆర్ఆర్ఆర్ ట్రైలర్ చూసిన తర్వాత వారి నోటి మాట బంద్ అవడం ఖాయం అంటున్నారు.. ఇప్పటి వరకూ భరించిన ఇతర హీరోల అభిమానులు. అదన్నమాట.

Related Posts