యూట్యూబ్ ని షేక్ చేస్తున్న ఆర్ఆర్ఆర్ ఎత్త‌ర జెండా సాంగ్.

యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్, మెగా ప‌వ‌ర్ స్టార్ రామ్ చ‌ర‌ణ్‌, ద‌ర్శ‌క‌ధీరుడు రాజ‌మౌళి.. ఈ ముగ్గురు కాంబినేష‌న్లో రూపొందిన భారీ, క్రేజీ మ‌ల్టీస్టార‌ర్ ఆర్ఆర్ఆర్. బాహుబ‌లి త‌ర్వాత రాజ‌మౌళి చేస్తోన్న సినిమా కావ‌డం.. ఎన్టీఆర్, చ‌ర‌ణ్ క‌లిసి న‌టించ‌డంతో ఆర్ఆర్ఆర్ పై ఆకాశ‌మే హ‌ద్దు అనేలా అంచ‌నాలు ఏర్ప‌డ్డాయి. దీంతో సినీ అభిమానులంద‌రూ ఎప్పుడెప్పుడు ఆర్ఆర్ఆర్ విడుద‌ల అవుతుందా..? అని ఎంతో ఆతృత‌గా ఎదురు చూస్తున్నారు.

మార్చి 25న ప్ర‌పంచ వ్యాప్తంగా ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చేందుకు రెడీ అయ్యింది. రిలీజ్ డేట్ ద‌గ్గ‌ర ప‌డుతుండ‌డంతో ప్ర‌మోష‌న్స్ లో స్పీడు పెంచారు మేక‌ర్స్. ఇందులో భాగంగా ఆర్‌ఆర్‌ఆర్‌ నుంచి ఓ స్పెషల్‌ సర్‌ప్రైజ్‌ని విడుదల చేశారు. పరాయి పాలన పై కాలు దువ్వి.. కొమ్ములు విదిలించిన కోడె గిత్తల్లాంటి అమర వీరులను తలచుకుంటూ.. అంటూ ప్రారంభమైన నెత్తురు మరిగితే ఎత్తర జెండా పాట శ్రోతలను విశేషంగా ఆకట్టుకుంటోంది. ఇందులో రామ్ చరణ్, ఎన్టీఆర్ మరియు హీరోయిన్ అలియా భట్ ల డ్యాన్స్ ప్రత్యేకంగా నిలిచింది. దేశభక్తిని చాటిచెప్పేలా పలువురు స్వాతంత్ర్య సమరయోధుల గెటప్స్ లో తారక్, చరణ్ అలరించారు.

ఈ పాటకు ఎమ్ ఎమ్ కీరవాణి జాయ్ ఫుల్ ట్యూన్ అందించారు. విశాల్ మిశ్రా, పృథ్వీ చంద్ర, సాహితి చాగంటి, హారిక నారాయణ్ కలిసి ఈ ఆర్ఆర్ఆర్ అంతెమ్ ను ఆలపించారు. లిరిసిస్ట్ రామజోగయ్యశాస్త్రి దీనికి సాహిత్యం అందించారు. డ్యాన్స్ మాస్టర్ ప్రేమ్ రక్షిత్ ఈ మ్యూజిక్ వీడియోకి కాన్సెప్ట్ డిజైన్ చేయగా.. హరీష్ కొరియోగ్రఫీ చేశారు. తెలుగుతో పాటుగా హిందీ తమిళ్ మలయాళం కన్నడ భాషల్లో వచ్చిన ఈ పాట యూట్యూబ్ ని రికార్డు వ్యూస్ తో షేక్ చేస్తోంది. ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

Related Posts