రివ్యూ – బంగార్రాజు

నటీనటులు – అక్కినేని నాగార్జున, నాగ చైతన్య, రమ్యకృష్ణ, కృతి శెట్టి, చలపతి రావు, రావు రమేష్, బ్రహ్మాజి, వెన్నెల కిషోర్, ఝాన్సీ

సాంకేతిక బృందం – స్క్రీన్ ప్లే : సత్యానంద్, సంగీతం : అనూప్ రూబెన్స్, సినిమాటోగ్రఫర్ : యువరాజ్, ఆర్ట్ డైరెక్టర్ : బ్రహ్మ కడలి, నిర్మాత : అక్కినేని నాగార్జున, కథ, దర్శకత్వం : కళ్యాణ్ కృష్ణ

టాలీవుడ్ బిగ్గెస్ట్ సీజన్స్ లో సంక్రాంతి ఒకటి. స్టార్ హీరోల సినిమాలు ఈ పండగ సీజన్ కు పోటాపోటీగా రిలీజ్ అవుతుంటాయి. అయితే కోవిడ్ పరిస్థితుల వల్ల గత రెండేళ్లుగా సంక్రాంతి సినిమా సీజన్ కళ తప్పింది. ఈసారి రాధే శ్యామ్, ఆర్ఆర్ఆర్ రిలీజ్ వాయిదా పడగా..సోగ్గాడు నాగార్జున మాత్రం డేర్ స్టెప్ వేసి తన కొత్త సినిమా బంగార్రాజును థియేటర్ లలో రిలీజ్ చేశారు. సోగ్గాడే చిన్ని నాయన సినిమాకు ప్రీక్వెల్ గా వచ్చిన బంగార్రాజు ఆ సినిమా రేంజ్ లో అలరించాడా లేదా రివ్యూలో చూద్దాం.

కథేంటంటే

సోగ్గాడే చిన్ని నాయన సినిమా చూసిన వాళ్లకు సులువుగా అర్థమయ్యే కథ ఇది. కొడుకు రాము (నాగార్జున) కోడలు సీత (లావణ్య త్రిపాఠి)ని కలిపి పైలోకాలకు వెళ్లిన బంగార్రాజు తన మనవడు చిన బంగార్రాజు (నాగ చైతన్య) కోసం భూమ్మీదకు వస్తాడు. మనవడి పెళ్లితో పాటు ప్రజలకు మంచి జరిగే ఓ పని మీద బంగార్రాజును కిందకు పంపిస్తాడు యమధర్మరాజు (నాగబాబు). చిన బంగార్రాజు ఓ ప్లేబాయ్. ఊరిలో అమ్మాయిలతో సరదాగా గడుపుతుంటాడు. అతనికి సర్పంచ్ నాగలక్ష్మి మంచి జోడు. అయితే వీరికి ఒక్క క్షణం పడదు. భార్య సత్యభామ (రమ్యకృష్ణ) తమ మనవడిని మనవరాలిని ఒకటి చేయమని కోరుతుంది. ఆమె కోరికను బంగార్రాజు ఎలా తీర్చాడు, అదే సమయంలో ఊరిలోని సంపదపై కన్నేసిన దుష్ట శక్తుల ఆట ఎలా కట్టించాడు అనేది మిగిలిన కథ.

ఫ్లస్ పాయింట్స్

నాగార్జున, నాగచైతన్య నటన
కలర్ ఫుల్ గా ఉండే సినిమా
టెక్నికల్, మేకింగ్ వ్యాల్యూస్
సెకండాఫ్

మైనస్ పాయింట్స్

ఊహించగలిగే కథనం
స్లోగా సాగే ఫస్టాఫ్
పండని కామెడీ

విశ్లేషణ

బంగార్రాజు సంక్రాంతి సినిమా అని నాగార్జున ప్రచార కార్యక్రమాల్లో చెప్పిన మాటలు పూర్తిగా నిజమని సినిమా చూసినప్పుడు అర్థమవుతుంది. కలర్ ఫుల్ మేకింగ్, పచ్చటి లొకేషన్స్, ఊరి పరిసరాలు ఇవన్నీ కలిసి పండగ వాతావరణాన్ని తెరపై ఆవిష్కరించాయి. ఈ అట్మాస్పియర్ ను కెమెరా ద్వారా మరింత కలర్ ఫుల్ గా చూపించారు సినిమాటోగ్రాఫర్ యువరాజ్. ప్రతి ఫ్రేమ్ అందంగా కనిపిస్తుంది. అలాగే అనూప్ రూబెన్స్ పాటలు, నేపథ్య సంగీతం బంగార్రాజుకు అస్సెట్ అని చెప్పొచ్చు. మేకింగ్ వ్యాల్యూస్ లో కథను ఎక్కడా తగ్గకుండా నిర్మించారు. స్పెషల్ ఎఫెక్టులు బంగార్రాజు కథను మరింత ఎలివేట్ చేశాయి.

బంగార్రాజు ను భుజాల మీద వేసుకుని తీసుకెళ్లారు నాగార్జున. సోగ్గాడే క్యారెక్టర్ లో చూపించిన ఈజ్, చిలిపితనం, అల్లరి బంగార్రాజులోనూ ప్రదర్శించాడు. అప్పుడు కొడుకు కాపురం నిలబెట్టిన సోగ్గాడు…ఇప్పుడు మనవడి ప్రేమను గెలిపించి, అతన్నో ఇంటివాడిని చేసే ప్రయత్నాలు బాగున్నాయి. ఆత్మగా వచ్చినా సినిమా అంతా నాగార్జునే నడిపించాడు. చిన బంగార్రాజు పాత్రలో నాగ చైతన్య జోష్ ఫుల్ గా నటించాడు. ఆత్మగా బంగార్రాజు వచ్చినప్పుడు అతనిలో మరింత ఎనర్జీ కనిపించింది. ప్లే బాయ్ క్యారెక్టర్ నాగ చైతన్యకు కొత్త..అయినా బాగానే నటించాడు. సర్పంచ్ నాగలక్ష్మి క్యారెక్టర్ ను తన నటనతో, అందంతో నిలబెట్టింది కృతిశెట్టి. రమ్యకృష్ణ, రావు రమేష్, నాగబాబు పాత్రల మేరకు మెప్పించారు.

దర్శకుడు కళ్యాణ్ కృష్ణ కెరీర్ కు పునాది వేసిన సినిమా సోగ్గాడే చిన్ని నాయన. ఈ సినిమా అప్పటికి చాలా ఫ్రెష్ ఫీలింగ్ , నేటివిటీతో తెరకెక్కించారు దర్శకుడు. కానీ బంగార్రాజులో అంత ఫ్రెష్ నెస్ కనిపించలేదు. అప్పటికే తెలిసిన కథ కావడంతో పాటు ఈ కథ కూడా ఊహించేలా ఉండటంతో నెక్ట్ ఏం జరుగుతుందో అనే ఆసక్తి కలగదు. ఫస్టాఫ్ ఫర్వాలేదనిపిస్తుంది అంతే. సెకండాఫ్ లో కథ సీరియస్ నెస్ పెరిగి, గుడి సీన్స్, యాక్షన్ ఎపిసోడ్స్ తో పీక్స్ కు చేరుతుంది. కథనాన్ని మరింత ఆసక్తికరంగా రాసుకునే వీలు కథలో ఉన్నా ఆ ప్రయత్నం జరగలేదు.

రేటింగ్ – 3/5

Related Posts