రివ్యూ – హీరో

నటీనటులు – అశోక్ గల్లా, నిధి అగర్వాల్, జగపతి బాబు, నరేష్, సత్య, అర్చన సౌందర్య

సాంకేతిక బృందం – మ్యూజిక్ : జిబ్రాన్, సినిమాటోగ్రఫీ : సమీర్ రెడ్డి, రిచర్డ్ ప్రసాద్, ఆర్ట్ : ఏ రామాంజనేయులు, ఎడిటర్ : ప్రవీణ్ పూడి, డైలాగ్స్ : కళ్యాణ్ శంకర్, ఏఆర్ ఠాగూర్, నిర్మాత : పద్మావతి గల్లా, స్టోరీ, స్క్రీన్ ప్లే, డైరెక్షన్ : శ్రీరామ్ ఆదిత్య

భలే మంచి రోజు, శతమంతకమణి, దేవదాసు లాంటి హిట్ చిత్రాలు రూపొందించిన దర్శకుడు ఓ కొత్త హీరోను లాంఛ్ చేస్తున్నాడంటే సినిమా మీద పాజిటివ్ అంచనాలే ఉంటాయి. సినిమా నిండా ప్యాడింగ్ ఆర్టిస్టులు, పేరున్న నాయిక, భారీ మేకింగ్ తో ఎంపీ గల్లా జయదేవ్ తన వారసుడు గల్లా అశోక్ ను హీరోగా హీరో చిత్రంతో ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చారు. మరి ఈ సినిమా రిలీజ్ ముందున్న అంచనాలను అందుకుందా లేదా రివ్యూలో చూద్దాం

కథేంటంటే

అర్జున్ (గల్లా అశోక్) ఒక మిడిల్ క్లాస్ అబ్బాయి. తండ్రి నరేష్, తల్లి అర్చనాతో సరదాగా ఉంటాడు. అర్జున్ కు హీరో కావాలన్నది కోరిక. కొడుకు కోరికకు తండ్రి ఒప్పుకోకున్నా తల్లి నువ్వు హీరో అవుతావని ప్రోత్సహిస్తుంది. అర్జున్ పొరుగింటి అందమైన అమ్మాయి సుబ్బు (నిధి అగర్వాల్)తో ప్రేమలో పడతాడు. ఆమె తండ్రి జగపతి బాబు. హీరో ప్రయత్నాల్లో ఉండగా అర్జున్ కు ఓ కొరియర్ వస్తుంది. అందులో ముంబై మమాఫియా పంపిన గన్ ఉండటం అర్జునన్ కు ఆశ్చర్యాన్ని, భయాన్నీ కలిగిస్తుంది. ఈ కొరియర్ తప్పుగా వచ్చిందని, అది ఎవరిదో తిరిగి ఇచ్చేయాలని ప్రయత్నిస్తాడు అర్జున్. గన్ తిరిగిచ్చే క్రమంలో కథ ఎలాంటి మలుపులు తిరిగింది, ముంబై మాఫియాతో అర్జున్ తలపడే పరిస్థితి ఎందుకొచ్చింది అనేది మిగిలిన కథ.

ఫ్లస్ పాయింట్స్

ఫస్ట్ హాఫ్
గల్లా అశోక్ నటన
బ్రహ్మాజీ కామెడీ
గ్రాండ్ మేకింగ్

మైనస్ పాయింట్స్

బలహీన స్క్రీన్ ప్లే
తేలిపోయిన సెకండాఫ్

విశ్లేషణ

హీరో సినిమా ఒక కొత్త హీరో లాంఛింగ్ కు పనికొచ్చే తరహా చిత్రం. ఫైట్స్, డాన్స్, కామెడీ వంటి అన్ని కమర్షియల్ ఎలిమెంట్స్ కలిపి రాసుకున్న కథ ఇది. దర్శకుడు శ్రీరామ్ ఆదిత్య గతంలో కామెడీని బాగా హ్యాండిల్ చేశాడు కాబట్టి…ఆ టైప్ కథకే ప్రాధాన్యమిచ్చాడు. గత చిత్రాల్లో కథలు బలంగా ఉండటం వల్ల సదరు సినిమాలు ప్రేక్షకుల ఆదరణ పొందాయి. హీరో సినిమాలో బలహీన కథ కావడం వల్ల ప్రథమార్థం ఉత్సాహం వరకే సరిపోయింది. సెకండాఫ్ లోని సీరియస్ నెస్ ను నిలబెట్టలేకపోయింది.

హీరోగా మారాలనే కథానాయకుడి ప్రయత్నాలు, హీరోయిన్ తో ప్రేమలో పడటం, గన్ తెచ్చిన సర్ ప్రైజ్ వంటి హైలైెట్స్ అన్నీ సినిమా ఫస్ట్ హాఫ్ లోనే ఉన్నాయి. ముంబై మాఫియాతో తేల్చుకునే సెకండాఫ్ పెద్దగా ట్విస్టులేమీ లేకుండా ప్లేన్ గా సాగుతుంది. ఒక చిన్న పాయింట్ ను క్లైమాక్స్ దాకా లాగాడు దర్శకుడు. ఇక్కడే సెకండాఫ్ తేలిపోయింది.

డెబ్యూ హీరోగా గల్లా అశోక్ పూర్తి ఎఫర్ట్స్ పెట్టి నటించాడు. డాన్సులు, ఫైట్స్ లో ఆకట్టుకున్నాడు. కామెడీ టైమింగ్ లోనూ ఫర్వాలేదనిపించాడు. నాయిక నిధి అగర్వాల్ అందంగా కనిపించడమే కాదు ఓ హాట్ కిస్ కూడా పెట్టేసి..తనకు సాధ్యమైనంత ఆడియెన్స్ ను అట్రాక్ట్ చేసింది. హీరోయిన్ తండ్రిగా జగపతి బాబుది కీలక పాత్ర. వెటరన్ హీరోగా బ్రహ్మాజీ చేసిన కామెడీ బాగా నవ్విస్తుంది. టెక్నికల్ గా సినిమా చాలా రిచ్ గా ఉంది. జిబ్రన్ మ్యూజిక్ లో రెండు పాటలు బాగున్నాయి. సినిమాటోగ్రఫీ కలర్ ఫుల్ గా ఉంది. యాక్షన్ సీక్వెన్సులు బాగా డిజైన్ చేశారు.

రేటింగ్ 3/5

Related Posts