గుర్తొచ్చిందా శీతాకాలం ..?

నటుడుగా సత్తా చాటినా హీరోగా మాత్రం మెప్పించలేకపోతున్నాడు సత్యదేవ్. నిజానికి ఆయనకు హీరో అంత స్టేచర్ లేదనే కమెంట్స్ కూడా ఉన్నాయి. కానీ హీరోగా ఓ సినిమా సూపర్ హిట్ అయితే ఇవన్నీ పోతాయి. నటుడుగా వంక పెట్టడానికి లేదు కానీ.. స్టార్డమ్ మాత్రం పెరగడం లేదు. చాలా సినిమాలు కమిట్ అయి ఉన్న సత్యదేవ్, తమన్న ప్రధాన పాత్రలో చాలా రోజుల క్రితం ఓ సినిమా అనౌన్స్ అయింది. ఓ కన్నడ హిట్ మూవీ లవ్ మాక్ టెయిల్ కి రీమేక్ గా వస్తోన్న ఈ చిత్రానికి ‘గుర్తుందా శీతాకాలం’అనే పొయొటిక్ టైటిల్ కూడా పెట్టారు. కానీ ఆ తర్వాత ఆ సినిమా ఊసే మర్చిపోయారు. ఇటు జనం కూడా శీతాకాలం వచ్చినా ఆ చిత్రం గురించి పట్టించుకోలేదు. ఇలాంటి టైమ్ లో సడెన్ గా ఈ మూవీ రిలీజ్ టైమ్ ను అనౌన్స్ చేసింది టీమ్.
నాగశేఖర్ డైరెక్షన్ లో వస్తోన్న గుర్తుందా శీతాకాలం చిత్రంలో మేఘా ఆకాశ్, కావ్యశెట్టి కూడా ఇతర కీలక పాత్రల్లో నటిస్తున్నారు. సడెన్ గా సీన్ లోకి ఎంటర్ అయిన ఈ మూవీని ఫిబ్రవరిలో విడుదల చేస్తున్నాం అని ప్రకటించారు. ఇక జనవరి 26న సత్యదేవ్ నటించి ‘గాడ్సే’చిత్రం విడుదల కాబోతోంది. అలాగే ఫిబ్రవరి 25న తమన్న ఎఫ్ 3 వస్తోంది. ఈ రెండు సినిమాల మధ్య గుర్తుందా శీతాకాలం విడుదల చేయడానికి ప్లాన్ చేస్తున్నారు. మొత్తంగా కాలభైరవ సంగీతం అందిస్తోన్న ఈ చిత్రానికి లక్ష్మీ భూపాల్ మాటలు రాశారు. మరి కన్నడలో సూపర్ హిట్ అయిన ఈ రొమాంటిక్ ఎంటర్టైనర్ తెలుగులో ఏ మాత్రం ఆకట్టుకుంటుందో చూడాలి.

Related Posts