ఏంటో.. పవన్ కళ్యాణ్ సినిమాల్లానే స్పీచులూ ఉంటున్నాయి

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గా తిరుగులేని ఫ్యాన్ బేస్ ఫామ్ చేసుకున్నాడు. అతనిలాంటి అభిమానులు మరే స్టార్ హీరోకూ ఉండరనేది నిజం. వారిని నమ్ముకునే రాజకీయాల్లో దిగి ఇబ్బంది పడుతున్నాడనేదీ నిజం. అయితే పవన్ కళ్యాణ్ సినిమాలకు సంబంధించి ఓ సెంటిమెంట్ కనిపిస్తుంది. ఒక సినిమా హిట్ అయితే తర్వాతవన్నీ పోతుంటాయి. ఆ హిట్ అయిన సినిమా రికార్డ్స్ క్రియేట్ చేస్తుంది కూడా. ఇప్పుడు పవన్ కళ్యాణ్ పొలిటికల్ స్పీచులు కూడా అలాగే కనిపిస్తున్నాయి. ఒకటి చాలా మెచ్యూర్డ్ గా అటాకింగ్ గా కనిపిస్తుంది. మరోటి పూర్తిగా డిఫెన్స్ లో పడిపోతుంది.
మొన్నటికి మొన్న రిపబ్లిక్ ఫంక్షన్ లో మాట్లాడిన తర్వాత జరిగిన రాజకీయ సభల్లో పవన్ మెచ్యూరిటీకి చాలామంది ఫిదా అయ్యారు. ఇలాంటి స్పీచులు, పరిపక్వత కదా మేం కోరుకునేదీ అని ఇతర పార్టీల వాళ్లు సైతం భావించారు. కట్ చేస్తే లేటెస్ట్ గా వైజాగ్ స్టీల్ ప్లాంట్ కోసం దీక్ష చేశాడు. అంత వరకూ బానే ఉంది. కానీ ఆ దీక్ష తర్వాత ఇచ్చిన స్పీచే.. గబ్బర్ సింగ్ తర్వాత వచ్చిన సర్దార్ గబ్బర్ సింగ్ లా అనిపించింది.
నా సినిమాల టికెట్ రేట్లు తగ్గిస్తే.. ఏకంగా ఫ్రీ షోస్ వేస్తా అన్నాడు. అది ఆయన నిర్ణయమా. అసలు ఆ హక్కు ఆయనకు ఉంటుంది. సినిమాలు తీసే నిర్మాతల గురించి ఆలోచించరా..? ఓ వైపు టికెట్ రేట్ల కోసం పరిశ్రమ అంతా నానా తంటాలు పడుతోంటే.. ఈయన మాత్రం ఇంకాస్త పుల్లలు వేస్తున్నాడని పరిశ్రమ నుంచే సెటైర్స్ పడుతున్నాయి. ఇదే సభలో వైసీపి పైన చేసిన విమర్శలు కూడా చవకబారుగా ఉన్నాయనేది నిజం. కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని ప్రశ్నించలేక.. తన సినిమాలు, టికెట్ రేట్లు, ఫ్రీ షోస్ అంటూ మాట్లాడ్డం అవసరమా..? నిజంగా ఫ్రీ షోస్ వేసేవారు అంతంత రెమ్యూనేషన్ తీసుకుంటారా..? తీసుకునే రెమ్యూనరేషన్ లో నష్టపోయిన నిర్మాతల గురించి ఎప్పుడైనా ఆలోచించారా.. అంటూ సోషల్ మీడియా వేదికగా పవన్ పై సెటైర్స్ పడుతున్నాయి. అయినా చేసిన దీక్ష గురించి మాట్లాడక ఈ ఫ్రీ షోస్ అంటూ డైవర్షన్ దేనికీ..?

Related Posts