మ‌హేష్ తో మూవీ గురించి రాజ‌మౌళి ఇంట్ర‌స్టింగ్ కామెంట్స్

సూప‌ర్ స్టార్ మ‌హేష్ బాబు, ద‌ర్శ‌క‌ధీరుడు రాజ‌మౌళి కాంబినేష‌న్లో ఓ భారీ పాన్ ఇండియా మూవీ రానుంద‌ని గ‌త కొన్ని రోజులుగా వార్త‌లు వ‌స్తూనే ఉన్నాయి. అభిమానులు ఎప్ప‌టి నుంచో ఈ క్రేజీ మూవీ గురించి ఆతృత‌గా ఎదురు చూస్తున్నారు. ఇదిలా ఉంటే.. రాజ‌మౌళి తెర‌కెక్కించిన‌ ఆర్ఆర్ఆర్ సినిమా జ‌న‌వ‌రి 7న ప్ర‌పంచ వ్యాప్తంగా ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చేందుకు రెడీ అవుతుంది. ఈ సంద‌ర్భంగా ప్ర‌మోష‌న్స్ లో స్పీడు పెంచారు.

అయితే.. ఆర్ఆర్ఆర్ ప్ర‌మోష‌న్స్ లో రాజ‌మౌళికి ఆస‌క్తిక‌ర‌మైన ప్ర‌శ్న‌లు ఎదుర‌వుతున్నాయి. ముఖ్యంగా మ‌హేష్ బాబుతో చేయ‌నున్న సినిమా ఎలా ఉంటుంది.? ఎప్పుడు స్టార్ట్ అవుతుంది.? త‌దిత‌ర ప్ర‌శ్న‌లు ఎదుర‌వుతున్నాయి. మ‌హేష్ బాబుతో సినిమా గురించి అడిగిన ప్ర‌శ్న‌ల‌కు జ‌క్క‌న్న స్పందిస్తూ.. ఆర్ఆర్ఆర్ సినిమా టైమ్ లో మ‌హేష్ బాబుతో చేయ‌నున్న సినిమా గురించి మాట్లాడ‌డం క‌రెక్ట్ కాదు.

ఆర్ఆర్ఆర్ స‌క్స‌స్ అంతా అయిపోయిన త‌ర్వాత ఆ సినిమా గురించి మాట్లాడుకుందాం అని త‌న‌దైన స్టైల్ లో స‌మాధానం చెప్పారు. ఇప్పుడు ఇది సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అవుతుంది. అంతే కాకుండా మహేష్ 29వ సినిమా ట్యాగ్ కూడా ఇండియన్ వైడ్ ట్రెండ్ అవ్వడం స్టార్ట్ అయ్యింది. మ‌రి.. ఆర్ఆర్ఆర్ స‌క్స‌స్ త‌ర్వాత మ‌హేష్ బాబుతో చేయ‌నున్న సినిమా గురించి ఏం చెబుతారో చూడాలి.

Related Posts