నానిని నమ్మి సినిమా నిర్మించా – ‘శ్యామ్ సింగరాయ్’ నిర్మాత వెంకట్ బోయనపల్లి

నాని హీరోగా నటిస్తున్న కొత్త సినిమా శ్యామ్ సింగరాయ్. ఈ సినిమాను నీహారిక ఎంటర్ టైన్ మెంట్స్ బ్యానర్ మీద నిర్మించారు వెంకట్ బోయనపల్లి. డిసెంబర్ 24న శ్యామ్ సింగరాయ్ ప్రేక్షకుల ముందుకొస్తోంది. ఈ సందర్భంగా నిర్మాత వెంకట్ బోయనపల్లి సినిమా విశేషాలు తెలిపారు.

వెంకట్ బోయనపల్లి మాట్లాడుతూ…కేవలం నాని మీద నమ్మకంతో శ్యామ్ సింగరాయ్ నిర్మించాను. నానితో గతంలో కృష్ణార్జున చిత్రాన్ని మరో ప్రొడ్యూసర్ తో కలిసి నిర్మించాను. ఆ సినిమా టైమ్ లో సినిమా పట్ల నానికున్న కమిట్ మెంట్ కనిపించింది. అలా ఆయన కోసమే ఆగి, ఈ సినిమా చేశాం. దర్శకుడు రాహుల్ సాంకృత్యన్ ను హీరో నాని బాగా నమ్మారు. నానిని నేను నమ్మాను. ఒక సినిమా అంటే దర్శకుడో, హీరో మీదనో నమ్మకం ఉంటేనే చేయాలి. శ్యామ్ సింగరాయ్ ఒక కొత్త తరహా సినిమా. మా నీహారికా బ్యానర్ అంటే శ్యామ్ సింగరాయ్ గుర్తొచ్చేలా ఉంటుంది. కథ మీద నమ్మకంతోనే భారీగా ఖర్చు పెట్టి చేశాం. పుష్ప, ఆర్ఆర్ఆర్ మధ్యలో మా సినిమా రిలీజ్ అవుతోంది. చిత్ర విజయంపై నమ్మకంతో ఉన్నాం. త్వరలో నానితోనే మరో సినిమా చేయబోతున్నాం. అన్నారు.

Related Posts