రష్మికను చూసి గర్వపడుతున్నాను.. విజయ్ దేవరకొండ

బాలీవుడ్ తో పోల్చుకుంటే టాలీవుడ్ లో లవ్ ఎఫైర్స్ గురించిన వార్తలు తక్కువగానే వస్తుంటాయి. అయితే.. సౌత్ తో పాటు నార్త్ లోనూ సూపర్ క్రేజ్ సంపాదించుకున్న విజయ్ దేవరకొండ, రష్మిక మాత్రం ఎప్పుడూ ఇలాంటి వార్తల్లో నిలుస్తూనే ఉంటారు. వీరిద్దరూ డేటింగ్ లో ఉన్నారని.. త్వరలోనే నిశ్చితార్థం జరుపుకుని పెళ్లి చేసుకోబోతున్నారంటూ చాన్నాళ్ల నుంచి ప్రచారం జరుగుతూనే ఉంది. అయితే.. అవన్నీ రూమర్సేనని వీళ్లిద్దరూ కొట్టి పారేస్తూనే ఉన్నారు. అలాగే.. తాము మంచి స్నేహితులమని చెబుతూ ఉంటారు.

వీరిద్దరిలో ఒకరికి సంబంధించి ఏదైనా మంచి విషయం జరిగితే.. మరొకరు అభినందించడంలో ముందుంటారు. లేటెస్ట్ గా ఫోర్బ్స్ ఇండియా మ్యాగజైన్ ప్రకటించిన ‘30 అండర్ 30’ జాబితాలో చోటు సంపాదించుకుంది నేషనల్ క్రష్ రష్మిక. వివిధ రంగాల్లో తమదైన ముద్రవేసిన 30 ఏళ్లలోపు యువతీయువకులతో ఫోర్బ్స్ మ్యాగజైన్ ‘30 అండర్ 30’ జాబితాను రూపొందిస్తుంది. ఈ ఏడాది రష్మికతో ఇందులో స్థానం లభించింది. ఈ సందర్భంగా.. తనకు దక్కిన ఈ గుర్తింపుపై రష్మిక సోషల్ మీడియా వేదికగా స్పందించింది. ఇక.. ఈ పోస్టును విజయ్ దేవరకొండ కూడా షేర్ చేస్తూ ఆమెకు అభినందనలు తెలిపాడు. ‘నిన్ను చూస్తే గర్వంగా ఉంది. ఇలాగే నువ్వు మరింత ఎత్తుకు ఎదగాలి’ అంటూ కామెంట్ పెట్టాడు. ప్రస్తుతం రష్మిక గురించి విజయ్ చేసిన ఈ కామెంట్స్ సోషల్ మీడియాలో ట్రెండింగ్ లోకి దూసుకెళ్లాయి.

Related Posts