“ఆర్ఆర్ఆర్” ట్రైల‌ర్ రిలీజ్ వాయిదా

యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్, మెగాపవర్ స్టార్ రామ్ చరణ్, ద‌ర్శ‌క‌ధీరుడు రాజ‌మౌళిల కాంబినేష‌న్లో రూపొందుతోన్న సంచ‌ల‌న చిత్రం ఆర్ఆర్ఆర్. ఈ భారీ పాన్ ఇండియా మూవీ కోసం సినీ అభిమానులు అంద‌రూ ఎంతో ఆతృత‌గా ఎదురు చూస్తున్నారు. ఇప్ప‌టి వ‌ర‌కు రిలీజ్ చేసిన సాంగ్స్, టీజ‌ర్ కు ట్రెమండ‌స్ రెస్పాన్స్ రావ‌డంతో సినిమా పై అంచ‌నాలు ఆకాశాన్ని అంటాయి. భారీ చిత్రాల నిర్మాత డి.వి.వి. దాన‌య్య ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ భారీ పాన్ ఇండియా మూవీని ప్ర‌పంచ వ్యాప్తంగా సంక్రాంతి కానుక‌గా జ‌న‌వ‌రి 7న రిలీజ్ చేయ‌నున్నారు.

ఈ సంద‌ర్భంగా ఈ సినిమా నుంచి ట్రైలర్ రిలీజ్ చేయ‌నున్న‌ట్టుగా అనౌన్స్ చేశారు. ఈ డిసెంబర్ 3న ఈ భారీ చిత్రం ట్రైలర్ ను విడుద‌ల చేయ‌డానికి ముహుర్తం ఫిక్స్ చేశారు. అయితే.. ఇప్పుడు ఈ ట్రైలర్ అనుకున్న సమయానికి రిలీజ్ చెయ్యడం లేదు. కార‌ణం ఏంటంటే.. అనుకోని కార‌ణాల వ‌ల‌న ఈ మూవీ ట్రైల‌ర్ ను డిసెంబ‌ర్ 3న రిలీజ్ చేయ‌డం లేదు. ఎప్పుడు రిలీజ్ చేయ‌నున్నాం అనేది త్వ‌ర‌లో ప్ర‌క‌టిస్తామ‌ని ఆర్ఆర్ఆర్ మేక‌ర్స్ అఫిషియ‌ల్ గా అనౌన్స్ చేశారు.

Related Posts