బాలీవుడ్ సినిమాలు వద్దు.. కెజీఎఫ్ ముద్దు

బాలీవుడ్ సినిమాలు వద్దు.. కెజీఎఫ్ ముద్దు అనే మాట బాలీవుడ్ జనాలే చెబుతుండటం విశేషం. యస్.. వినడానికి కాస్త ఆశ్చర్యంగా ఉన్నా.. ఈ మాట అంటున్నది నార్త్ ఆడియన్సెస్ కావడం విశేషం. మామూలుగా బాలీవుడ్ లో రెగ్యులర్ మాస్ మసాలా సినిమాలు పెద్దగా కినిపించవు. ఎక్కువగా ఫ్యామిలీ, యూత్ ఫుల్, రొమాంటిక్ డ్రామాలే ఉంటాయి. డిజిటల్ మీడియా పెరిగిన తర్వాత యూ ట్యూబ్ రూపంలోనూ, డబ్బింగ్ సినిమాలుగానూ అక్కడి ప్రేక్షకులు సౌత్ సినిమాలపై ఎక్కువ మోజుపడుతున్నారు. అందుకే బాలీవుడ్ హీరోలు కూడా ఇప్పుడు ఎక్కువగా సౌత్ సినిమాలనే రీమేక్ చేసి విజయాలు అందుకుంటున్నారు. లేదంటే సౌత్ లాగా తమ సినిమాల్లో మాస్ మసాలా అంశాలు ఉండేలా చూసుకుంటున్నారు. ఈ కారణంగానే ప్యాన్ ఇండియన్ సినిమాగా మనవాళ్లు చాలా త్వరగా ఎదిగారు.. ఎదుగుతున్నారు. కానీ వాళ్లు ఆ విషయంలో దక్షిణాది ప్రేక్షకులను మనవాళ్ల స్థాయిలో మెప్పించలేకపోతున్నారు అనేది నిజం. అందుకే ఇప్పుడు బాలీవుడ్ సినిమాల కంటే దక్షిణాది సినిమాలే ముద్దు అనే స్థాయికి అక్కడి ప్రేక్షకులు చేరుకున్నారు. అందుకు కారణం మన మాస్ మూవీసే అనేది నిజం.
ఇంతకీ విషయం ఏంటంటే.. ఓ ప్రైవేట్ ఆర్గనైజేషన్ వాళ్లు ఒక సర్వే నిర్వహించారు. బాలీవుడ్ లో రూపొందిన టాప్ ఫైవ్ ఫిల్మ్స్ లో ఏ సినిమా కోసం ఎక్కువగా ఎదురుచూస్తున్నారు అని. అందులో ఏదీ చిన్న సినిమా లేదు. అన్నీ టాప్ స్టార్స్ నటించినవి.. భారీ బడ్జెట్ చిత్రాలే. అయినా వాళ్లు మాత్రం మొదటి స్థానం కెజీఎఫ్ చాప్టర్ 2కు కట్టబెట్టారు. అంటే ఫస్ట్ ప్రియారిటీ కెజీఎఫ్ కే ఇచ్చారన్నమాట. మరి ముందున్న ఆ నాలుగు సినిమాలేంటీ అంటారా..? ఒకటి రణ్ బీర్ కపూర్, అలియాభట్, అమితాబ్, నాగార్జున నటించిన బ్రహ్మాస్త్ర, రెండోది ఆమిర్ ఖాన్, నాగచైతన్య నటించిన లాల్ సింగ్ చద్దా, మూడోది టైగర్ ష్రాఫ్, నవాజుద్దీన్ సిద్ధిఖీ, తారా సుతారియా నటించిన హీరోపంతి-2, ఇక నాలుగవది అక్షయ్ కుమార్, జాక్వలిన్ ఫెర్నాండెజ్ నటిస్తోన్న రామ్ సేతు ఉన్నాయి. ఈ నాలుగు సినిమాలూ భారీ చిత్రాలే. అయినా బాలీవుడ్ జనం మాత్రం మాకు కెజీఎఫ్ చూడాలని ఉంది ఓటు వేసి ఆ చిత్రాన్నే నెంబర్ వన్ ప్లేస్ లో పెట్టడం విశేషమే కదా..

Related Posts