మళ్లీ మాస్ రూట్ లో నాగచైతన్య..

నాగచైతన్య.. కెరీర్ ఆరంభంలో మాస్ ఇమేజ్ కోసం ట్రై చేశాడు. బట్ అతన్ని యాక్షన్ హీరోగా చూడాలంటే జనానికి దడ వచ్చేసింది. అందుకే ఆ టైమ్ లో వరుసగా చైతూ సినిమాలన్నీ ఆటోనగర్ షెడ్ కు వెళ్లిపోయాయి. బట్ ఇప్పుడు రూట్ మార్చాడు. తన ఆహార్యానికి, ఫిజిక్ కు తగ్గ సినిమాలు చేస్తూ దూసుకుపోతున్నాడు. వరుసగా సూపర్ హిట్స్ అందుకుంటున్నాడు. ప్రస్తుతం అతను నటించిన థ్యాంక్యూ సినిమా విడుదలకు సిద్ధమైంది. విక్రమ్ కుమార్ డైరెక్షన్ లో రాశిఖన్నా, మాళవిక నాయర్, అవికా గోర్ హీరోయిన్లుగా నటించిన సినిమా ఇది. జూలై 22న విడుదల కాబోతోన్న ఈ చిత్ర ప్రమోషన్స్ తో బిజీగా ఉన్నాడు చైతన్య. మరోవైపు ఇదే దర్శకుడితో దూత అనే వెబ్ సిరీస్ కూడా చేస్తున్నాడు. అటు బాలీవుడ్ లో ఎంట్రీ ఇస్తోన్న లాల్ సింగ్ ఛద్దా సినిమా ఆగస్ట్ 12న రిలీజ్ కాబోతోంది. ఇక రీసెంట్ గా తమిళ్ టాలెంటెడ్ డైరెక్టర్ వెంకట్ ప్రభుతో సినిమా ఓపెనింగ్ జరుపుకుంది.

ఈ సినిమాకు సంబంధించి కొన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ వస్తున్నాయి.కొన్నాళ్లుగా మాస్ ఇమేజ్ కు దూరంగా సినిమాలు చేస్తోన్న చైతూ వెంకట్ ప్రభుతో డైరెక్షన్ లో అవుట్ అండ్అవుట్ యాక్షన్ మూవీ చేస్తున్నాడని సమాచారం. చైతూ ఇమేజ్ కు తగ్గట్టుగా ఉంటూనే కంప్లీట్ మాస్ ఎంటర్టైనర్ గా ఈచిత్రం ఉంటుందని తమిళ్ మీడియాలో న్యూస్ వస్తున్నాయి. ఇవన్నీ ప్రామిసింగ్ జర్నలిస్ట్స్ నుంచి వస్తుండటంతో ఇది నిజమే అంటోంది కోలీవుడ్ మీడియా. ఇదే నిజమైతే ఈ బై లింగ్వుల్ మూవీతో చైతూ మరోసారి మాస్ ఇమేజ్ కోరుకుంటున్నాడనుకోవచ్చు.ఇక మరో విశేషం ఏంటంటే.. ఈ మూవీ ఓ రకంగా ఫ్యామిలీ ప్యాక్ అని చెప్పొచ్చు. ఈ దర్శకుడు వెంకట్ ప్రభు మ్యూజిక్ మాస్ట్రో ఇళయరాజా తమ్ముడు గంగై అమరన్ కొడుకు. అలాగే ఈ మూవీకి రాజాతో పాటు ఆయన తనయుడు యువన్ శంకర్ రాజా సంయుక్తంగా సంగీతం అందిస్తున్నారు. అంటే తమ్ముడి కొడుకు కోసం ఇళయరాజా స్వయంగా రంగంలోకి దిగాడన్నమాట. అయితే ఈ ఇద్దరు సంగీత దర్శకులు ఏం చేస్తారా అన్న డౌట్ కు కూడా ఆన్సర్ వచ్చేసింది.వెంకట్ ప్రభు, చైతూ కాంబోలో వస్తోన్న ఈ యాక్షన్ ఎంటర్టైనర్ కు ఇళయరాజా పాటలు అందిస్తాడట. అలాగే యువన్ శంకర్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ ఇవ్వబోతున్నాడు. మరి ఈ తండ్రి కొడుకుల మ్యూజిక్ ఈ చిత్రాన్ని ఏ రేంజ్ లో నిలబెడుతుందో చూడాలి.

Related Posts