నాగ చైతన్య మూవీ కి డేట్స్ ఇవ్వని హీరోయిన్

ఎనభై కిలోమీటర్ల వేగంతో వెళ్లేవాడినిక సడెన్ గా స్పీడ్ బ్రేకర్ వస్తే ఎలా ఉంటుందో అలా ఉంది నాగ చైతన్య పరిస్థితి. ఆ మధ్య వరుసగా నాలుగైదు హిట్లు కొట్టాడు. కానీ రీసెంట్ గా వరుసగా రెండు ఫ్లాపులు పడ్డాయి. ఇందులో ఒకటి అతను హీరోగా నటించింది కాదు. అయినా ఆ ఎఫెక్ట్ కనిపిస్తోంది. అందుకే రాబోయే ప్రాజెక్ట్స్ గురించి ఇంకాస్త జాగ్రత్తగా ఉంటున్నాడు. ఆ జాగ్రత్త ఎంత వరకూ వెళ్లిందంటే ఏకంగా ప్రాజెక్ట్ నే క్యాన్సిల్ చేసుకునేంతగా.. ఫ్లాపులు వస్తే ప్రాజెక్ట్ లు ఆపుకోవాలా.. కంటెంట్ పెంచుకోవాలి కానీ అంటారా.. ? బట్ చైతూ డెసిషన్ కు ఓ రీజన్ ఉంది.. వరుస విజయాలు వస్తున్నప్పుడు ఎంత కాన్ఫిడెంట్ గా కనిపిస్తారో.. ఫ్లాపులు వస్తున్నప్పుడు అంతే బేజారుగా ఉంటారు.

కొందరు పైకి కనిపించేలా ప్రవర్తిస్తారు. మరికొందరు లైట్ తీసుకుంటారు. ఈ రెండూ మిక్స్ అయిట్టుగా ఉన్నాడు నాగ చైతన్య. తను ఎంతో నమ్మకం పెట్టుకుని పెద్ద అంచనాలతో వచ్చిన థ్యాంక్యూ సినిమాకు ఆడియన్స్ సారీ చెప్పేశారు. ఏ మాత్రం కొత్తదనం లేని కథగా తేల్చేశారు ప్రేక్షకులు. ఇక అనవసరంగా చేసిన సినిమాగా లాల్ సింగ్ చడ్డా మిగిలింది. ఇందులో అతని పాత్ర అస్సలు బాలేదు. తక్కువ సేపే అయినా.. ఆ పాత్ర ఎప్పుడు కనిపించినా.. చూసేవారంతా విసుగు చెందారు. దీంతో గెస్ట్ రోల్ కూడా చైతూకు బ్యాడ్ అయిపోయింది.వరుసగా రెండు ఫ్లాపులు వచ్చాక మరింత జాగ్రత్తగా ఉంటున్నాడు. ప్రస్తుతం థ్యాంక్యూ దర్శకుడు విక్రమ్ కుమార్ తోనే దూత అనే వెబ్ సిరీస్ చేస్తున్నాడు.

దీంతో పాటు మోస్ట్ టాలెంటెడ్ తమిళ్ డైరెక్టర్ వెంకట్ ప్రభుతో ఓ సినిమా చేస్తున్నాడు. బై లింగ్వుల్ గా వస్తోన్న ఈ చిత్రంలో అతని సరసన కృతిశెట్టి హీరోయిన్ గా నటిస్తోంది. ఈ మూవీకి ముందే పరశురామ్ డైరెక్షన్ లో సినిమాకు కమిట్ అయి ఉన్నాడు చైతన్య. పరశురామ్ సడెన్ గా మహేష్‌ బాబుతో సర్కారువారి పాట కోసం వెళ్లాడు. పెద్ద ప్రాజెక్ట్ కదా అని చైతూ కూడా అబ్జెక్షన్ చెప్పలేదు. బట్ సర్కారు వారి పాట పెద్దగా ఆకట్టుకోలేదు. ఇటు తనూ రెండు ఫ్లాపులు చూసి ఉన్నాడు.

ఈ టైమ్ లో రిస్క్ ఎందుకు అనుకున్నాడేమో.. పరశురామ్ తో సినిమా చేయకూడదు అనుకుంటున్నాడట. పరశురామ్ ఈ చిత్రంలో రష్మిక మందన్నానే హీరోయిన్ గా ఉండాలని దర్శకుడు ఫిక్స్ అయ్యాడు. గతంలో అతను రష్మికకు గీత గోవిందం వంటి బ్లాక్ బస్టర్ ఇచ్చాడు కాబట్టి.. తను కూడా చేయాలనుకుంటోంది. బట్ రష్మిక ఇప్పుడు ఫుల్ బిజీగా ఉంది. ఎప్పుడు డేట్స్ ఇస్తుందో చెప్పలేదట. ఫ్లాప్ ఇచ్చిన దర్శకుడు, డేట్స్ ఇవ్వలేని హీరోయిన్ తో సినిమా చేయడం ఎందుకు అనే ఏకంగా ప్రాజెక్ట్ నే క్యాన్సిల్ చేసుకున్నాడు అంటున్నారు. మరి ఈ విషయాన్ని వాళ్లు అఫీషియల్ గా చెబుతారా లేక ఖండిస్తారా అనేది చూడాలి.

Related Posts