ట్రెండ్ అవుతోన్న ” బాయ్ కాట్ లైగర్” హ్యాష్ ట్యాగ్

బాలీవుడ్ లో నెపోటిజంపై ఎప్పటి నుంచో ఓ వ్యతిరేకత నడుస్తోంది. అందుకే వస్తోన్న ప్రతి సినిమానూ బ్యాన్ చేయాలంటూ సోషల్ మీడియాలో హల్చల్ చేస్తున్నారు. అయితే ఈ సెగ విజయ్ దేవరకొండపైనా పడింది. లేటెస్ట్ గా బాయ్ కాట్ లైగర్ అంటూ హ్యాష్ సోషల్ మీడియాలో విస్తృతంగా ప్రచారం అవుతోంది. దీన్ని లైట్ తీసుకోవాలంటూ విజయ్ అంటున్నాడు.. కానీ వాళ్లు ట్రెండింగ్ చేయడం ఆపలేదు. అందుకు కారణాలు ఎలా ఉన్నా.. ఈ మూవీతో మన రౌడీ స్టార్ బాలీవుడ్ లో జెండా ఎగరేస్తాడా అనేదే పెద్ద ప్రశ్న..

చాలా వేగంగా ప్యాన్ ఇండియన్ స్టార్ గా ఎదిగాడు విజయ్ దేవరకొండ. బాలీవుడ్ లో ఒక్క సినిమా కూడా చేయకుండానే నార్త్ బెల్ట్ లో తిరుగులేని క్రేజ్ తెచ్చుకున్నాడు. అందుకు కరణ్ జోహార్ ఓ కారణం అని అందరికీ తెలుసు. అలాగే మనోడి యాటిట్యూడ్ కూడా అక్కడి జనాలను అట్రాక్ట్ చేస్తోంది. దీంతో నార్త్ యూత్ విజయ్ పై విపరీతమైన అభిమానం పెంచుకున్నాడు. అది లైగర్ మూవీ ఓపెనింగ్స్ కు బాగా కలిసొస్తుంది అనుకుంటోన్న టైమ్ లో సడెన్ గా బాయ్ కాట్ లైగర్ అనే హ్యాష్‌ ట్యాగ్ ట్రెండింగ్ లోకి రావడంతో ఎంటైర్ టీమ్ ఖంగు తింది. బట్ తమ సినిమాను చూసేవారు చూస్తారు లేదంటే లేదు. అంతే కానీ ఈ హ్యాష్‌ ట్యాగ్ లకు భయపడేది లేదంటూ విజయ్ దీమాగా ఉన్నాడు.

లైగర్ సినిమాపై బాయ్ కాట్ ఉద్యమం రావడానికి కారణం విజయ్ దేవరకొండ కాదు.. అక్కడ నెపోకిడ్స్ ను ఎంకరేజ్ చేస్తోన్న కరణ్ జోహార్ ఈ మూవీ నిర్మాణ భాగస్వామి కావడంతో పాటు హీరోయిన్ అనన్య పాండేనే అందుకు కారణం. కారణాలు వాల్లైనా ఏదైనా తేడా కొడితే లాస్ అయ్యేది విజయ్ అండ్ పూరీ జగన్నాథ్. బట్ కంటెంట్ బావుంటే ఏ హ్యాష్‌ ట్యాగులూ ఏం చేయలేవు అనేది నిజం. వీళ్లు కూడా కంటెంట్ పై నమ్మకంతోనే ఈ నెగెటివిటీని లైట్ తీసుకుంటున్నాడు. ఇక రమ్యకృష్ణ కీలక పాత్రలో నటించిన ఈ మూవీలో ఒకప్పటి బాక్సింగ్ ఛాంప్ మైక్ టైసన్ ఓ కీ రోల్ ప్లే చేశాడు. ఈ నెల 25న విడుదల కాబోతోన్న లైగర్ పై ఇప్పటికే భారీ అంచనాలున్నాయి. ఖచ్చితంగా ఎక్స్ పెక్టేషన్స్ ను రీచ్ అవుతాం.. రికార్డులూ కొడతాం అనే కాన్ఫిడెన్స్ తో కనిపిస్తోంది లైగర్ టీమ్. మరి వారి కాన్ఫిడెన్స్ గెలుస్తుందేమో చూడాలి.