గామి టీమ్‌ కు నాగ్‌ అశ్విన్ ప్రశంస

మానవ స్పర్శను అనుభవించలేని అరుదైన సమస్యతో బాధపడే అఘోరాగా విశ్వక్‌సేన్ యాక్ట్ చేస్తున్న మూవీ గామి. క్రౌడ్ ఫండ్ తో తెరకెక్కిన ఈ చిత్రం మహా శివరాత్రి సందర్భంగా మార్చి 8న విడుదలకు సిద్ధమవుతోంది. రిలీజ్ డేట్ పోస్టర్ కూడా ప్రేక్షకుల్లో చాలా క్యూరియాసిటీని క్రియేట్ చేసింది.
గామి చిత్ర కాన్సెప్ట్‌ని నాగ్‌ అశ్విన్ మెచ్చుకుంటూ మార్చి 8 న రిలీజ్‌ కాబోతున్న గామి చిత్రాన్ని చూడటానికి వెయిట్ చేస్తున్నానంటూ ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేసారు. నాగ్ అశ్విన్‌ చెప్పిన ఈ మాటలు గామి టీమ్‌కు గొప్ప ఉత్సాహాన్ని కలగజేసాయని చెప్పారు.

Related Posts