మహేష్‌ బాబు – త్రివిక్రమ్.. మరో కొత్త అప్డేట్

కొన్ని కాంబినేషన్స్ ఎప్పుడు వచ్చినా క్రేజీగా ఉంటుంది. ఆ కాంబో లాంగ్ గ్యాప్ తర్వాత సెట్ అయితే అంచనాలు కూడా పెరుగుతాయి. వాటిని అందుకోవాంలంటే స్క్రిప్ట్ స్టేజ్ నుంచే జాగ్రత్తలు తీసుకోవాలి. పైగా వరుస విజయాలతో ఉన్న హీరోతో సినిమా అంటే మరింత కేర్ ఫుల్ గా ఉండాలి. మొత్తంగా అనౌన్స్ అయి చాలా రోజులవుతోన్న ఇప్పటి వరకూ కథ గురించి ఏ కథనమూ రాని ఓ క్రేజీ కాంబినేషన్ గురించి మంచి న్యూస్ వచ్చేసింది. కథ కుదిరిందట. అంటే ఇక షూటింగే కదా..? ఇంతకీ ఈ కాంబినేషన్ ఏంటీ అనుకుంటున్నారా.. సూపర్ స్టార్ మహేష్‌, త్రివిక్రమ్.దర్శకుడుగా త్రివిక్రమ్ కు పెద్దగా క్రేజ్ లేని టైమ్ లో వచ్చిన సినిమా అతడు. ఇందులో మహేష్‌ బాబు కూల్ గా ఉంటూ ఖూనీలు చేసే క్యారెక్టర్ లో అద్భుతమైన నటన చూపించాడు. డిఫరెంట్ టేకింగ్ తో త్రివిక్రమ్ కూడా దర్శకుడుగా మరో అడుగు ముందుకువేశాడు. కాకపోతే ఈ మూవీ థియేటర్స్ లో భారీ విజయ సాధించలేదు. జస్ట్ హిట్ అంతే. కానీ టివిల్లో మాత్రం బ్లాక్ బస్టర్ అనిపించుకుంది. ఆ తర్వాత వీరి కాంబినేషన్ లో వచ్చిన సినిమా ఖలేజా. అప్పటికే మహేష్‌ బాబు పోకిరి, బిజినెస్ మేన్ అంటూ మాస్ ను ఊపేస్తున్నాడు. ఆ టైమ్ లో కంప్లీట్ కామెడీ యాంగిల్ లో వచ్చిన ఖలేజా బాక్సాఫీస్ వద్ద టైటిల్ పవర్ ను చూపించలేదు.

బట్ మహేష్‌ బాబు కామెడీ టైమింగ్ మాత్రం అదిరిపోతుందీ సినిమాలో.ఇక ఖలేజా వచ్చిన 11యేళ్ల తర్వాత మళ్లీ ఈ కాంబినేషన్ లో సినిమా సెట్ అయింది. అల వైకుంఠపురములో అంటూ బిగ్గెస్ట్ హిట్ ఇచ్చిన తర్వాత త్రివిక్రమ్ శ్రీనివాస్ చాలా గ్యాప్ తీసుకున్నాడు. ఈ గ్యాప్ కు కారణం లేకపోలేదు. అల వైకుంఠపురములో తర్వాత ఎన్టీఆర్ తో సినిమా చేయాల్సి ఉంది. కానీ కథ విషయం తేలలేదు. దీంతో ఆ వెయిటింగ్ అంతా వేస్ట్ అయింది. దీంతో ఎన్టీఆర్ కొరటాలతో సినిమాకు ఓకే చెప్పాడు. ఇటు త్రివిక్రమ్ కూడా ఏ మాత్రం తగ్గకుండా వెంటనే మహేష్‌ బాబుతో సినిమా అన్నాడు. మాటైతే అన్నారు కానీ అప్పటికి కథ లేదు. దీంతో అనౌన్స్ మెంట్ తర్వాత షూటింగ్ కు వెళ్లడానికి చాలా టైమ్ తీసుకున్నారు. ఫైనల్ గా త్రివిక్రమ్ మహేష్‌ కు లేటెస్ట్ గా స్క్రిప్ట్ ఫుల్ నెరేషన్ఇచ్చాడు. చిన్న చిన్న మార్పులతో మొత్తం ఓకే అయిందంటున్నారు. సో త్వరలోనే ప్రీ ప్రొడక్షన్ స్టార్ట్ చేసి దసరా వరకూ సెట్స్ పైకి వెళ్లేలా ప్లాన్ చేసుకుంటున్నారట. చాలా గ్యాప్ తర్వాత వస్తోన్ సినిమా కాబట్టి ఈ కాంబినేషన్ పై భారీ అంచనాలున్నాయి. ఇటు మహేష్‌ బాబు కూడా వరుసగా విజయాల సాధిస్తున్నాడు. బిగ్గెస్ట్ హిట్స్ అని చెప్పలేం కానీ.. ఏదీ డిజప్పాయింట్ చేయడం లేదు. రీసెంట్ గా వచ్చిన సర్కారువారి పాట కూడా ఓకే అనిపించుకుంది. అటు త్రివిక్రమ్ కూడా ఇండస్ట్రీ హిట్ లాంటి అల వైకుంఠపురములో తర్వాత చేస్తోన్న సినిమా కాబట్టి ప్యాన్ ఇండియన్ లెవల్లో ఈ మూవీపై ఆసక్తి ఉంటుంది. మరి ఈ సారి ఎలాంటి కంటెంట్ తో వస్తున్నారో కానీ.. గత రెండు సినిమాల్లా వెండితెరపై డిజప్పాయింట్ చేయకూడదంటే ఒకేసారి మాస్ అండ్ క్లాస్ ను ఆకట్టుకోవాలి.

Related Posts