ad

ఆఫర్స్ లేని హీరోయిన్లు ఐటమ్ గాళ్ అవతారాలెత్తడం ఎప్పుడో మొదలైంది. హీరోయిన్లు ఐటమ్ సాంగ్స్ చేస్తే ఆడియన్స్ లో వచ్చే క్రేజ్ వేరే లెవల్లో ఉంటుంది. అందుకే బడ్జెట్ భారీగా ఉన్నా.. బొమ్మను బ్లాక్ బస్టర్ చేయాలని ఇలా చేస్తుంటారు. నిన్ననే రామారావు ఆన్ డ్యూటీ కోసం బాలీవుడ్ బ్యూటీని తీసుకువచ్చిన తెలుగు మేకర్స్ లేటెస్ట్ గా మాచర్ల నియోజకవర్గం కోసం సరైన భామను రంగంలోకి దించారు. అఫ్‌ కోర్స్ ఈ మాజీ హీరోయిన్ తెలుగులో ఆల్రెడీ కొన్ని ఐటమ్స్ చేసింది. మరి ఈ ఐటమ్ ఎలా ఉంటుందో..? ఐటమ్ సంగతి సరే కానీ అసలు హీరోయిన్ ఎవరూ అంటారా..?తెలుగు అమ్మాయిలకు టాలీవుడ్ లో ఆఫర్స్ ఉండవు అనే మాట ఎప్పుడూ వింటూనే ఉంటాం. ఆ లిస్ట్ లోనే ఉండే బ్యూటీ అంజలి. తెలుగు నుంచి కోలీవుడ్ కు వెళ్లి అక్కడ మినీ మూవీస్ నుంచి ఎదిగి మీడియంలో టాప్ స్టార్ అనిపించుకుని తర్వాత బిగ్ మూవీస్ లోనూ ఆకట్టుకుంది. అదే టైమ్ లో అప్పుడప్పుడూ తెలుగులోనూ హీరోయిన్ గా చాలా ప్రయత్నాలు చేసింది.

కొన్ని హిట్ అయినా.. తనను తెలుగు మేకర్స్ కంటిన్యూ చేయలేదు. దీంతో ముందు నుంచీ ఎక్కువగా కోలీవుడ్ పైనే ఫోకస్ చేసి అక్కడే తన జెండా ఎగరేసిందీ రాజోలు భామ.కొన్నాళ్ల క్రితం సింగం2 సినిమాలో స్పెషల్ సాంగ్ చేసి ఒకేసారి తెలుగు, తమిళ్ ఆడయన్స్ ను ఎంటర్టైన్ చేసింది. తర్వాత అల్లు అర్జున్, బోయపాటి శ్రీను కాంబినేషన్ లో వచ్చిన సరైనోడు చిత్రంలో ఐటమ్ సాంగ్ చేసి ఆకట్టుకుంది. ఈ సినిమాతో పాటు అమ్మడి సాంగ్ కూడా బ్లాక్ బస్టర్ అయిపోయింది. ఆ తర్వాత కూడా చాలా సినిమాల్లో స్పెషల్ సాంగ్ ఆఫర్స్ వచ్చినా పెద్దగా చేయలేదు. ప్రస్తుతం రామ్ చరణ్ – శంకర్ కాంబోలో వస్తోన్న చిత్రంలో నటిస్తోన్న అంజలి లేటెస్ట్ గా మరో ఐటమ్ సాంగ్ కు ఓకే చెప్పింది. నితిన్ హీరోగా రూపొందుతోన్న మాచర్ల నియోజకవర్గం చిత్రంలో అంజలి స్పెషల్ సాంగ్ లో చిందేయబోతోంది. ఇంతకంటే పెద్ద సినిమాల్లో ఐటమ్ ఆఫర్స్ వచ్చినా కాదని మరీ ఈ చిత్రంలో నర్తిస్తోందంటే పాటో, బీటో ఓ రేంజ్ లో నచ్చి ఉండొచ్చేమో. మరి ఆగస్ట్ 12న విడుదల కాబోతోన్న ఈ మూవీలో తన పాటకు ఎంత క్రేజ్ వస్తుందో చూడాలి.Mache

, , , , ,