కీర్తి సురేష్ కు రిలీజ్ డేట్ దొరికింది..

మహానటితో ఫేమ్ అయిన కీర్తి సురేష్ వరుస సినిమాలతో ఫుల్ బిజీగా ఉంది. హిందీలో తప్ప సౌత్ లో తెలుగు, తమిళ్, మళయాల సీమల్లో తనదైన శైలిలో జెండా ఎగరేస్తోంది. ప్రస్తుతం సూపర్ స్టార్ మహేష్ సరసన సర్కారువారి పాటలో నటిస్తోన్న తను ఆ మూవీ షూటింగ్ టైమ్ లోనే కోవిడ్ బారిన పడింది. ఇండియాలోనే ఉంటూ రెస్ట్ తీసుకుంది. క్వారంటైన్ తర్వాత తనకు కోవిడ్ నెగెటివ్ వచ్చిందని సంబురంగా చెప్పిందీ సుందరి. ఇక తను గతంలోనే నటించిన తెలుగు సినిమా గుడ్ లక్ సఖి. ఆది పినిశెట్టి మేల్ లీడ్ లో నటించిన ఈ చిత్రం కీర్తి ప్రధానంగానే సాగుతుంది. మోస్ట్ టాలెంటెడ్ అనిపించుకున్న నగేశ్ కుకునూర్ డైరెక్షన్ లో రూపొందిన ఈ చిత్రం విడుదల తేదీని ప్రకటించింది మూవీ టీమ్.
ఓ మారుమూల తండా ప్రాంతానికి చెందిన ఓ గిరిజన యువతి ఆర్చరీలో దేశం గర్వించే స్థాయికి ఎలా ఎదిగింది అనే పాయింట్ చుట్టూ అల్లుకున్న కథగా ఆ మధ్య విడుదల చేసిన టీజర్, సాంగ్స్ చూస్తే అర్థమైంది. ఆర్చరీ కోచ్ గా జగపతిబాబు మరో కీలక పాత్రలో నటించాడు. ఇలాంటి విలేజ్ గాళ్ పాత్రలో కనిపించడం కీర్తి సురేష్ కు ఫస్ట్ టైమ్. పైగా తనే ఆ స్లాంగ్ లో డబ్బింగ్ కూడా చెప్పుకుంది. అదీ సహజంగానే కుదిరినట్టుంది.
మొత్తంగా గుడ్ లక్ సఖి సినిమా పూర్తయి చాలాకాలం అయింది. చాలాసార్లు రిలీజ్ డేట్ అనే పోస్టర్స్ వేసి మళ్లీ వాయిదా వేశారు. చిరవగా కూడా డిసెంబర్ 10న విడుదల అన్నారు. బట్ పోస్ట్ పోన్ చేశారు. ఇప్పుడు మరోసారి కొత్త డేట్ వేశారు. ఈ నెల 28న గుడ్ లక్ సఖి విడుదలవుతుందంటూ అనౌన్స్ చేశారు. ప్రస్తుతం కీర్తి కరోనా నుంచి కోలుకుంది… కాబట్టి ఈ వారంలో ఈ సఖి మూవీ ప్రమోషన్స్ కు వస్తుందేమో. అందుకే ఆ డేట్ ను ఎంచుకున్నారని అనుకోవచ్చు. మరి ఈ గుడ్ లక్ సఖి బాక్సాఫీస్ వద్దా అలాగే అనిపించుకుంటుందా లేదా అనేది చూడాలి.

Related Posts