సెన్సార్ పూర్తి చేసుకున్న కెజీఎఫ్ రెండో చాప్టర్

నేషనల్ వైడ్ గా మూవీ లవర్స్ ఈగర్ గా వెయిట్ చేస్తున్న చిత్రం కెజిఎఫ్ ఛాప్టర్ 2. ఫస్ట్ పార్ట్ కి మించిన అంచనాలతో ఈ నెల 14న పాన్ ఇండియా లెవల్లో రిలీజ్ కి రెడీ అయ్యింది ఈ సినిమా. ఇప్పటికే మేకర్స్ దేశవ్యాప్తంగా ప్రమోషన్స్ చేస్తున్నారు. రీసెంట్ గా సెన్సార్ కూడా కంప్లీట్ చేసుకుంది కెజిఎఫ్ ఛాప్టర్ 2.
రాకింగ్ స్టార్ యష్, డైరెక్టర్ ప్రశాంత్ నీల్ కాంబినేషన్లో రూపొందిన కెజిఎఫ్ సంచలన విజయం సాధించింది. దీంతో ఇప్పుడొస్తున్న సెకండ్ పార్ట్ పై అంచనాలు ఓ రేంజ్ లో ఉన్నాయి. సెకండ్ పార్ట్ తో బాలీవుడ్ పై మరింత కాన్సన్ ట్రేట్ చేసిన మేకర్స్… అక్కడ నుంచి సంజయ్ దత్, రవీనా టాండన్ లను కీలక పాత్రల కోసం తీసుకున్నారు. వీరివల్ల హిందీ మార్కెట్ లోనూ కెజిఎఫ్ పార్ట్ 2పై అంచనాలు పెరిగాయి.
కెజిఎఫ్ చాప్టర్ 2 పై అంచనాలు పెరగడానికి ఫస్ట్ లుక్ టీజర్ కి కారణం అని చెప్పాలి. ఈ టీజర్ విడుదలయ్యాక ఎక్స్ పెక్టేషన్స్ ఓ రేంజ్ లో పెరిగాయి. యాక్షన్ ఎపిసోడ్స్ ఏ రేంజ్ లో ఉండబోతున్నాయో టీజర్ హింట్ ఇచ్చింది. ఇక రీసెంట్ గా ట్రైలర్ వచ్చాక మరింతగా సినిమాపై హైప్ పెరిగింది. ఇక ఈ ట్రైలర్ మిలియన్ల వ్యూస్ తో కొత్త రికార్డులు సెట్ చేసింది. కెజిఎఫ్ ఛాప్టర్ 2 ఈ నెల 14న విడుదలవుతోంది. అందుకే టీమ్ దేశవ్యాప్తంగా ప్రధాన నగరాల్లో ప్రమోషన్స్ చేస్తూ ఫుల్ బిజీగా ఉంది. రీసెంట్ గా సెన్సార్ కూడా కంప్లీట్ చేసుకున్న ఈ చిత్రం u/a సర్టిఫికేట్ తెచ్చుకుంది. గరుడును చంపి నరాచీని తన అధీనంలోకి తెచ్చికున్న రాఖీ బాయ్… తర్వతా అధీరాను, ఆ తర్వాత ఇండియన్ గవర్నమెంట్ ని ఎదిరించి ఎలా పోరాటం చేశాడనేది కెజిఎఫ్ ఛాప్టర్ 2 మూవీ అని తెలుస్తోంది. సినిమాపై ఉన్న అంచనాల కారణంగా భారీ కలెక్షన్లు ఎక్స్ పెక్ట్ చేస్తున్నారు ట్రేడ్ పండితులు.

Related Posts